ఏపీలో ప్రతి ఒక్కరికి మూడు మాస్కులు అందజేయాలని జగన్ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ‘రాష్ట్రంలో ప్రతి పౌరుడికి మూడు మాస్కులు అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చూపిన మార్గానికి దేశమంతా హర్షం వ్యక్తం చేస్తోంది. 16 కోట్ల మాస్కుల పంపిణీ ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. కరోనాపై బ్రహ్మస్త్రం ఇది. అతి తక్కువ ప్రాణ నష్టంతో ఏపీ సేఫెస్ట్ ప్లేస్ అవుతుంది' అని ఆయన అన్నారు. కరోనాపై జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూనే కొందరిపై విమర్శలు చేశారు. ‘ప్రభుత్వం నిరంతరం పని చేస్తుంటుంది. ఎప్పుడే నిర్ణయం తీసుకోవాలో ఆ విచక్షణాధికారం ఉంటుంది. కరోనా నివారణ కోసం ఏ రాష్ట్రం అమలు చేయని జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఎల్లో మీడియాకు, పచ్చ మేధావులకు ఇవేమీ కనిపించవు. నిమ్మగడ్డ పదవీకాలం ముఖ్యమైపోయింది వీళ్లకు. సిగ్గులేని బతుకులు.’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ప్రతి పౌరుడికి మూడు మాస్కులు అందజేయాలని సిఎం జగన్ గారు చూపిన మార్గానికి దేశమంతా హర్షం వ్యక్తం చేస్తోంది. 16 కోట్ల మాస్కుల పంపిణీ ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. కరోనాపై బ్రహ్మస్త్రం ఇది. అతితక్కువ ప్రాణ నష్టంతో ఏపీ సేఫెస్ట్ ప్లేస్ అవుతుంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 13, 2020
అటు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపైనా ఆరోపణలు చేశారు. చంద్రబాబు మానసిక పరిస్థితి దిగజారిందని ఎద్దేవా చేశారు. ‘సెంట్రల్ కేబినెట్ సెక్రటరీకి ఫోన్ కలుపు, ఏపీ సిఎస్ ను మాట్లాడమను, హెల్త్ సెక్రటరీ రిపోర్టేదీ? తక్షణం మీడియా కాన్ఫరెన్సు అరేంజ్ చేయండి. చంద్రబాబు పలవరింతలివన్నీ. ఆయన మానసిక పరిస్థితి బాగా దిగజారిందంటున్నారు. కరోనా తీవ్రత తగ్గేలోగా సీరియస్ అవుతుందని టెన్షన్ పడుతున్నారట’ అని వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP News, AP Politics, Chandrababu naidu, Tdp, Vijayasai reddy, Ycp