హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

లక్ష్మణరేఖ దాటొద్దు... వైసీపీ ఎంపీ హెచ్చరిక

లక్ష్మణరేఖ దాటొద్దు... వైసీపీ ఎంపీ హెచ్చరిక

వైసీపీ ప్రధాన కార్యాలయం

వైసీపీ ప్రధాన కార్యాలయం

PMRFకు రూ.10 లక్షలు, CMRFకు మరో రూ.10 లక్షల చొప్పున విరాళం ఇచ్చారు వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.

  ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ నియంత్రణ నిర్మూలన చర్యలను పటిష్టంగా అమలుచేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తన వంతు సాయంగా ప్రధాన మంత్రి సహాయనిధికి వ్యక్తిగతంగా రూ.10లక్షలు, ముఖ్యమంత్రి సహాయనిధికి వ్యక్తిగతంగా మరో రూ.10 లక్షలు విరాళంగా అందించినట్టు వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తెలిపారు. బాధ్యతగల పౌరుడిగా మాత్రమే కాకుండా ఒక పార్లమెంట్ సభ్యుడిగా తనకు ఉన్న ఎంపీ నిధులను కరోనా నియంత్రణకు కావలసిన పరికరాలు సమకూర్చడం కోసం ఖర్చు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం 24 వ తేదీన ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రస్తుతానికి రూ.కోటి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాల రాజుకి అందించానన్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గం నర్సాపురంలో కరోనా నియంత్రణకు ఖర్చు చేయాలని కోరినట్టు చెప్పారు.

  Ap news, ap politics, ysrcp, ap cm ys jagan mohan reddy, raghuramakrishnam raju, bjp, pm modi, ఏపీ న్యూస్, వైసీపీ, జగన్, రఘురామకృష్ణంరాజు, బీజేపీ, ప్రధాని మోదీ
  రఘురామకృష్ణం రాజు, (నర్సాపురం, వైసీపీ)

  బాధ్యతగా స్థోమత కలిగినవారందరు కూడా వారి వారి శక్తి మేరకు ప్రధానమంత్రి సహాయనిధికి, ముఖ్యమంత్రి సహాయనిధికి చేతనైనంత తోడ్పడాలని పిలుపునిచ్చారు. అలాగే మన చుట్టూ ఉన్న సమాజంలో ఎందరో పేదవారు ఉన్నారని, వారందరికీ వీలైనంత సహాయం చెయ్యాలన్నారు. అందరం కలిసికట్టుగా ఉండి ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి గీసిన లక్ష్మణరేఖను దాటకుండా, మన ఇళ్లలోనే మనం ఉండి రాబోయే రోజుల్లో మన దేశంలో కరోనాని పూర్తిగా నియంత్రిచి, నిర్ములిద్దామని పిలుపునిచ్చారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Andhra Pradesh, Coronavirus, MP raghurama krishnam raju

  ఉత్తమ కథలు