సెంటర్‌లోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే... అలా చేయొద్దంటూ...

కరోనాకు మందు లేదని... నివారణ ఒక్కటే మార్గమని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వాహనదారులకు వివరించారు.

news18-telugu
Updated: March 27, 2020, 2:45 PM IST
సెంటర్‌లోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే... అలా చేయొద్దంటూ...
సెంటర్‌లో నిలబడి ప్రజలకు సూచనలు చేస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... లాక్ డౌన్‌ను అమలు చేసేందుకు బాగానే శ్రమిస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వాలు ఎంతగా విజ్ఞప్తి చేస్తున్నా... కొందరు మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. పలు చోట్ల ఇలా బయటకు వచ్చే వారిని నియంత్రించేందుకు పోలీసులు తమ లాఠీలకు పని చేస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ప్రజాప్రతినిధులు సైతం ఇలాంటి వారికి అవగాహన కల్పించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రోడ్డు సెంటర్‌లో నిలబడి వాహనదారులకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

కరోనాకు మందు లేదని... నివారణ ఒక్కటే మార్గమని ఆయన వాహనదారులకు వివరించారు. తిరుపతిలోని లీలామహల్ సెంటర్‌లో వాహనదారుల రద్దీ ఎక్కువగా కనిపించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన భూమన కరుణాకర్ రెడ్డి... సెంటర్‌లో నిలబడి వారికి క్లాస్ తీసుకున్నారు. ఈరకంగా బయటకు రావడం వల్ల లాక్ డౌన్ అనే పదానికి అర్థం లేకుండా పోతుందని ఆయన ప్రజలకు తెలిపారు. దయచేసి అంతా ఇంటికి పరిమితం కావాలని సూచించారు.

First published: March 27, 2020, 2:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading