హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

ఆ జిల్లాలో డాక్టర్ల మాస్క్‌లు కొట్టేసిన వైసీపీ నేతలు.. టీడీపీ ఫైర్

ఆ జిల్లాలో డాక్టర్ల మాస్క్‌లు కొట్టేసిన వైసీపీ నేతలు.. టీడీపీ ఫైర్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు సమర్థవంతంగా లేవని నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు.

  ప్రాణాలను పణంగా పెట్టి కరోనా వైరస్ లాంటి మహమ్మారితో పోరాడుతున్న సమయంలో వైద్యులకు తోడ్పాటు అందించాల్సింది పోయి, ఏకంగా మెడికల్ సిబ్బంది కోసం తెచ్చిన క్వాలిటీ మాస్క్‌లను వీఐపీల పేరుతో వైసీపీ నాయకులు కొట్టేశారని టీడీపీ ఆరోపించింది. ఈ మేరకు టీడీపీ నేత నారా లోకేష్ వరుసగా ట్వీట్లు చేశారు. 'జగన్ గారి బాటలోనే వైసీపీ నాయకులు నడుస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా 420 బుద్ధులు వదులుకోలేకపోతున్నారు. డాక్టర్లకి ఇచ్చిన మాస్కులను వీఐపీలమంటూ వైసీపీ నాయకులు కొట్టేయ్యడం దారుణం' అని నారా లోకేష్ విమర్శించారు. వైసీపీ నాయకులు బాగుంటే చాలు వైద్య సిబ్బంది, ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కరోనా నివారణకు తీసుకున్న చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయన్నారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది వ్యక్తిగత రక్షణ కిట్లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందదని నారా లోకేష్ పెదవి విరిచారు.

  ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు సమర్థవంతంగా లేవని నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఎంతో మంది దాతలు ముందుకొచ్చి ప్రభుత్వానికి సహాయం అందిస్తున్నా ప్రభుత్వం అరకొర నిధులు విడుదల చెయ్యడం ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు. కరోనా నివారణకు నిధులు లేవని అధికారులు లేఖలు రాసే పరిస్థితి వచ్చిందంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఉందొ అర్థం చేసుకోవచ్చని ట్వీట్ చేశారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Andhra Pradesh, Coronavirus, Covid-19, Krishna District, Nara Lokesh

  ఉత్తమ కథలు