Home /News /coronavirus-latest-news /

Andhra Pradesh: 'కరోనాపై చేతులెత్తేసిన ప్రభుత్వం'... వైసీపీ నేతల వీడియో వైరల్.. ఓ ఆటాడుకుంటున్న టీడీపీ

Andhra Pradesh: 'కరోనాపై చేతులెత్తేసిన ప్రభుత్వం'... వైసీపీ నేతల వీడియో వైరల్.. ఓ ఆటాడుకుంటున్న టీడీపీ

వైసీపీ నేతల వీడియో వైరల్

వైసీపీ నేతల వీడియో వైరల్

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఎక్కడ చూసినా కరోనా (Corona) గురించే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ (YSRCP) నేతల వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది.

  ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కర్ఫ్యూ విధిస్తూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. అయినా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం అదుపులోకి రావడం లేదు. ఐతే కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే ఏపీలో కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే.. ఇదే రకమైన స్పందన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ కనిపించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైసీపీ నేతలు మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది.

  తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఓ ఇంట్లో కలిసి వైసీపీ ఎంపీలు, ఇతర నేతలు మాటల మధ్యలో కరోనా విలయం గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పరిస్థితి తీవ్రంగా ఉందని.. కొవిడ్ తో చనిపోయిన వారి మృతదేహాలను తరలించడానికి రూ.30 వేలు, దహనసంస్కారాలకు రూ.12 వేలు ఖర్చు చేయాల్సి వస్తుందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రజలకు ఏం చేశారు..? చేతులెత్తేశారు.. అంటూ కాస్త అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. ఐతే సదరు నేతలు రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడారా..? లేక కేంద్ర ప్రభుత్వంపై మాట్లాడారా..? అనేదానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షమైన టీడీపీ తన అధికార ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి వైసీపీని టార్గెట్ చేసింది.
  ఇది చదవండి: ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం.. పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్..


  “జ‌నం కాదు వైఎస్ జగన్.. .. నీ చేత‌గాని పాల‌న‌ని వైసీపీ ఎంపీలే ఎండ‌గ‌డుతున్నారు. క‌రోనా క‌ట్ట‌డికి ఏం చేయ‌లేని నీ ప‌నికిమాలిన పాల‌న‌ని దుమ్మెత్తిపోశారు. ప్ర‌జ‌ల ప్రాణాలు గాలికొదిలేశామ‌ని, ఈ విష‌యం మూర్ఖ‌పు ముఖ్య‌మంత్రికి చెబితే..సొంత పార్టీ అని కూడా చూడ‌కుండా క‌క్ష‌సాధింపుల‌కు దిగుతాడ‌ని భ‌య‌ప‌డి బ‌య‌ట ఎవ్వ‌రూ నోరు మెద‌ప‌ట్లేదు. ఇదిగో ఇలా వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు క‌లిసిన‌ప్పుడు నీ మూర్ఖ‌త్వాన్ని, నీ చేత‌గాని పాల‌న‌ని, క‌రోనా క‌ట్ట‌డిలో నీ వైఫ‌ల్యాల‌ను కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు. ``క‌రోనా నియంత్ర‌ణ‌కి జ‌గ‌నేం చేశాడు..బొక్క చేశాడు`` అంటూ పులివెందుల పిల్లి మెడ‌లో తొలి గంట క‌ట్టాడు ఎంపీ పిల్లి సుభాష్‌చంద్ర‌బోస్‌ గారు. ప్ర‌భుత్వం లాజిస్టిక్స్ మెయింటెన్ చేయ‌డంలేదు..జ‌గ‌న్‌ `` చేతులెత్తేశాడు`` అని మీ ఆకుల ఆగ్ర‌హంగా ఉన్నారు. శ‌వాల ద‌హ‌నం కూడా చందాలేసుకోవాల్సి వ‌స్తోంద‌ని వైసీపీ నేత‌లే వాపోతున్నారు.నేను మూర్ఖ‌పురెడ్డి అంటే ఉలిక్కిప‌డి బూతుల‌మంత్రిని బూతుల‌తోనో, పేటీఎం బ్యాచీల‌ను ఫేక్ ట్వీటుల‌తోనో దింపుతావు. నిన్ను మీవాళ్లే అంటున్నారు న‌ర్మ‌గ‌ర్భంగా మూర్ఖ‌పురెడ్డి అని” అంటూ  మాజీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.

  ఇది చదవండి: ఏపీలో కర్ఫ్యూ వేళ వీళ్ల గురించి మాట్లాడుకోవాల్సిందే..! ఎందుకంటే..


  ఈ వీడియో ఆధారంగా టీడీపీ సోషల్ మీడియా విభాగం.. వైసీపీపై, సీఎం జగన్ పై విమర్శలు చేస్తోంది. దీనిపై ఇంకా వైసీపీ నేతలు ఇంకా స్పందించాల్సి ఉంది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Social Media, Ysrcp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు