కరోనా ర్యాపిడ్ కిట్ల ధరలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..

కరోనా ర్యాపిడ్ కిట్ల ధరలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..

ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ అందుకున్న సీఎం జగన్ (File)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసిన కరోనా వైరస్ టెస్ట్ కిట్ల ధరల మీద వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దానిపై ఏపీ సర్కారు వివరణ ఇచ్చింది. కరోనా ర్యాపిడ్ కిట్లను ఏ రాష్ట్ర ప్రభుత్వమైతే తక్కువ రేటుకు కొన్నదో.. ఆ రేటు ప్రకారమే తాము కూడా చెల్లిస్తామని స్పష్టం చేసింది.

 • Share this:
  Corona Rapid kits rate in AP : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసిన కరోనా వైరస్ టెస్ట్ కిట్ల ధరల మీద వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లను ఒక్కొక్కటి రూ.337 చొప్పున కొనుగోలు చేసింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కో కిట్‌కు రూ.730 చెల్లించిందని వార్తలు వచ్చాయి. 2 లక్షల కరోనా టెస్ట్ కిట్లను కొనుగోలు చేయగా.. అందుకు రూ.14.60 కోట్ల ఖర్చు అయ్యింది. ఓ రకంగా చూస్తే ఛత్తీస్‌గఢ్ చెల్లించిన ధర కంటే రెట్టింపు ధరను ఏపీ ప్రభుత్వం చెల్లించింది. అయితే, మొత్తం 8 లక్షల కిట్లను ప్రభుత్వం ఆర్డర్ చేసినట్లు తెలిసింది. అందులో 25 శాతం ధర రూ.14.60 కోట్లు. అందులో తొలిదశలో లక్ష కిట్లు డెలివరీ అయ్యాయి. మిగిలిన డబ్బులు కిట్లు మొత్తం విజయవాడకు డెలివరీ అయిన తర్వాత చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే, ఈ ధరలపై ప్రభుత్వం విమర్శలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ.330 కి కొంటే.. ఏపీ ప్రభుత్వం రూ.730కి కొనడం ఏంటని జగన్ సర్కారుపై విమర్శలు గుప్పించారు.

  దీంతో.. ఏపీ సర్కారు వివరణ ఇచ్చింది. కరోనా ర్యాపిడ్ కిట్లను ఏ రాష్ట్ర ప్రభుత్వమైతే తక్కువ రేటుకు కొన్నదో.. ఆ రేటు ప్రకారమే తాము కూడా చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికైతే ఛత్తీస్‌గఢ్ తక్కువ రేటుకే కొన్నదని, ఆ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన మొత్తానికే ర్యాపిడ్ కిట్లకు డబ్బు చెల్లిస్తామని అందులో వివరించింది.

  ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ధరలపై
  ఏపీ ప్రభుత్వ వివరణ
  Published by:Shravan Kumar Bommakanti
  First published: