కరోనా టెస్ట్ చేయకుండానే పాజిటివ్.. మరీ ఇంత నిర్లక్ష్యమా..?

శనివారం పీహెచ్‌సీ సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పడంతో.. ఆ యువకుడు షాక్ తిన్నాడు. తనకు అసలు కరోనా పరీక్షలే చేయలేదని వాపోయాడు.

news18-telugu
Updated: June 29, 2020, 2:46 PM IST
కరోనా టెస్ట్  చేయకుండానే పాజిటివ్..  మరీ ఇంత నిర్లక్ష్యమా..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మన దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇన్నాళ్లు లైట్ తీసుకున్న ప్రజలు.. ఇప్పుడు పెరుగుతున్న కేసులను చూసి భయడిపోతున్నారు. లాక్‌డౌన్ విధించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఐతే మరోవైపు ప్రభుత్వాస్పత్రుల్లో కోవిడ్ రోగులకు అందుతున్న చికిత్స, పరీక్షా విధానాలపై ఇప్పటికే ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీలో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. అసలు కరోనా పరీక్షలు చేయకుండానే... కరోనా పాజిటివ్ వచ్చిందని ఓ యువకుడికి వైద్య సిబ్బంది సమాచారం ఇచ్చారు. దాంతో ఖంగుతిన్న యువకుడు.. ఇదేంటి? అసలు నాకు పరీక్షలే చేయలేదు. కరోనా సోకిందని ఎలా చెబుతారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలంలో ఈ ఘటన జరిగింది.

జి.కొత్తూరు గ్రామానికి చెందిన 28 ఏళ్ల యువకుడు జ్వరంగా ఉందని ఈ నెల కాకినాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయమని వైద్యులను కోరాడు. ఐతే ఆ రోజు డాక్టర్లు పరీక్షలు చేయలేదు. కేవలం వివరాలు నమోదు చేసుకొని.. కరోనా పరీక్ష ఎప్పుడు చేస్తామనేది ఫోన్ చేసి చెబుతామని ఇంటికి పంపించారు. ఆ తర్వాత ఎవరూ ఫోన్ చేయలేదు. ఐతే శనివారం పీహెచ్‌సీ సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పడంతో.. ఆ యువకుడు షాక్ తిన్నాడు. తనకు అసలు కరోనా పరీక్షలే చేయలేదని వాపోయాడు. దీనిపై వేట్లపాలెం వైద్యాధికారిణి ధనలక్ష్మికి ఫిర్యాదు చేశాడు. ఈ సమస్య జీజీహెచ్ సూపరింటెండెంట్ రాఘవేంద్రరావు దృష్టికి వెళ్లింది. ఇది ఎలా జరిగిందో పరిశీలిస్తామని ఆయన చెప్పారు. ఐతే సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా లాంటి మహమ్మారి విషయంలో మరీ ఇంత నిర్లక్ష్యమా ప్రజలు మండిపడుతున్నారు.

కాగా, గడిచిన 24 గంటల్లో ఏపీలో 793 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 81 మంది, విదేశాల నుంచి వచ్చిన వారు ఆరుగురు ఉన్నారు. మరో 11 మంది మరణించారు. తాజా లెక్కలతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,891కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 6,232 మంది కోలుకోగా.. 180 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 7,479 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.
First published: June 29, 2020, 2:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading