YOUR DIRTY LAPTOP COMPUTER KEYBOARD CAN GIVE YOU CORONAVIRUS KNOW HOW TO CLEAN IT SS
Work From Home: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? మీ ల్యాప్‌టాప్‌పై కరోనా వైరస్ ఉండొచ్చు
Work From Home: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? మీ ల్యాప్‌టాప్‌పై కరోనా వైరస్ ఉండొచ్చు
(ప్రతీకాత్మక చిత్రం)
Coronavirus Alert | అందరికీ శుభ్రతపై అవగాహన పెరిగింది. అన్ని వస్తువుల్ని శుభ్రంగా ఉంచుకుంటున్నారు. మీ ల్యాప్‌టాప్, కంప్యూటర్ను క్లీన్ చేయాల్సిన సమయం కూడా ఇదే. టెక్నాలజీ కంపెనీ హెచ్‌పీ కొన్ని టిప్స్ చెబుతోంది.
ఇండియా అంతా లాక్డౌన్ ఉండటంతో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్‌లో బిజీగా ఉన్నారా? రోజంతా ల్యాప్‌టాప్, కంప్యూటర్‌తో కుస్తీ పడుతున్నారా? ఒక్క నిమిషం. మీ ల్యాప్‌టాప్, కంప్యూటర్ క్లీన్ చేయకపోతే వైరస్ బారిన పడే ప్రమాదం ఉంది. మీరు అన్ని వస్తువులు ముట్టుకొని వచ్చి కంప్యూటర్ ముందు కూర్చుంటారు. సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, వైరస్లు మీ ల్యాప్‌టాప్, కంప్యూటర్ చుట్టూ చేరే ప్రమాదం ఉంది. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు... ప్రముఖ టెక్ కంపెనీ CBT Nuggets 2016 లోనే హెచ్చరించింది. టాయిలెట్ సీట్ కన్నా 20,000 రెట్లు మురికిగా మీ కంప్యూటర్, ల్యాప్‌టాప్ కీబోర్డ్ ఉంటుందని తేల్చింది. కీబోర్డ్‌పై ఎక్కువగా గ్రామ్ పాజిటీవ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియాతో న్యుమోనియా వచ్చే ప్రమాదం ఉంది.
ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతోంది. దీంతో అందరికీ శుభ్రతపై అవగాహన పెరిగింది. అన్ని వస్తువుల్ని శుభ్రంగా ఉంచుకుంటున్నారు. మీ ల్యాప్‌టాప్, కంప్యూటర్ను క్లీన్ చేయాల్సిన సమయం కూడా ఇదే. టెక్నాలజీ కంపెనీ హెచ్‌పీ కొన్ని టిప్స్ చెబుతోంది. మీ కంప్యూటర్ను, ల్యాప్‌టాప్‌ను ఎలా క్లీన్ చేయాలో సూచిస్తోంది. ఇందుకోసం ఆల్కహాల్ బేస్డ్ లిక్విడ్ ఉపయోగించాలి. 70% ఐసోప్రాపిల్ ఆల్కహాల్, 30% నీటితో ఉండే శానిటైజర్‌ను ఉపయోగించుకోవచ్చు. కంప్యూటర్ క్లీన్ చేసేప్పుడు డిస్పోజబుల్ గ్లోవ్స్ ఉపయోగించడం మర్చిపోవద్దు. ముందుగా మీ ల్యాప్‌టాప్, కంప్యూటర్ పవర్ కేబుల్‌ను డిస్కనెక్ట్ చేయాలి. బ్యాటరీ కూడా తొలగించాలి. ఎక్స్టర్నల్ డివైజ్‌లు కూడా తొలగించాలి.
ఆ తర్వాత మైక్రోఫైబర్ లేదా మెత్తటి క్లాత్ తీసుకొని లిక్విడ్‌లో ముంచి తీయాలు. ల్యాప్‌టాప్, కంప్యూటర్ బయటి భాగాలను శుభ్రం చేయాలి. కీబోర్డ్ కూడా క్లీన్ చేయాలి. ఎట్టిపరిస్థితుల్లో లిక్విడ్ లోపలికి వెళ్లకుండా చూసుకోవాలి. నేరుగా స్ప్రే చేయకూడదు. మొత్తం క్లీన్ చేసిన తర్వాత కాసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత మీరు గ్లోవ్స్ పారేసి, చేతులు శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు. కంప్యూటర్, ల్యాప్‌టాప్, కీబోర్డ్ మాత్రమే కాదు... ప్రింటర్ కూడా క్లీన్ చేయాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.