YOU CAN NOW BUY NON ESSENTIAL ITEMS ONLINE IN THESE DISTRICTS SK
ఆన్లైన్లో అన్ని వస్తువులూ కొనొచ్చు.. ఈ జిల్లాల్లో మాత్రమే అనుమతి
ప్రతీకాత్మక చిత్రం
లాక్డౌన్ 3 మార్గదర్శల ప్రకారం రెడ్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో యథావిధిగా తమ వ్యాపార కార్యకలాపాలను సాగించవచ్చు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ కామర్స్ సంస్థలు ఊపిరిపీల్చుకున్నాయి.
కేంద్రం ప్రభుత్వం లాక్డౌన్ 3ని ప్రకటించింది. మే 3 తర్వాత మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో మే 17 వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉంటుంది. ఐనప్పటికీ జోన్ల వారీగా ఎన్నో సడలింపులను ఇచ్చింది కేంద్రం. ఈ క్రమంలో ఈ-కామర్స్ బిజినెస్‌కు కొన్ని ఆంక్షలతో అనుమతినిచ్చింది. రెడ్జోన్లలో నిత్యావసర వస్తువుల డెలివరీకి మాత్రమే అనుమతి ఉంటుంది. ఐతే గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మాత్రం అన్నీ వస్తువుల ఆన్లైన్ షాపింగ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే కరోనా ప్రభావం లేని, తక్కువగా ఉన్న జోన్ల ప్రజలు టీవీ, ఫ్రిజ్, మొబైల్ ఫోన్లు వంటి వస్తువులను కొనుగోలు చేయవచ్చు.
లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఆమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లు తమ వ్యాపారాలను నిలిపివేశాయి. కేవలం ఆహార ధాన్యాలు, నిత్యావసర సరుకులు, మందులను మాత్రమే డెలివరీ చేస్తున్నాయి. ఐతే లాక్డౌన్ 3 మార్గదర్శల ప్రకారం రెడ్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో యథావిధిగా తమ వ్యాపార కార్యకలాపాలను సాగించవచ్చు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ కామర్స్ సంస్థలు ఊపిరిపీల్చుకున్నాయి. మళ్లీ తమ సేవలను ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్నాయి. ఐతే కేవలం ఆరెంజ్, గ్రీన్ జోన్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. మరి తెలుగు రాష్ట్రాల్లో ఏయే జిల్లాల్లో ఈ కామర్స్ సంస్థలు పనిచేయవచ్చో ఈ జాబితాలో చూడండి.