తండ్రి చివరి చూపుకు నోచుకోని యూపీ సీఎం యోగి.. అంత్యక్రియలకు దూరం

తండ్రి చివరి చూపుకు నోచుకోని యూపీ సీఎం యోగి.. అంత్యక్రియలకు దూరం

యోగి ఆదిత్యనాథ్

ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో యూపీ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని.. దానికి తోడు లాక్‌డౌన్ కారణంగా తండ్రి అంత్యక్రియలకు వెళ్లలేకపోతున్నానని చెప్పారు యోగి ఆదిత్యనాథ్.

  • Share this:
    కరోనా లాక్‌డౌన్‌తో తల్లిదండ్రులు చనిపోయినా చివరి చూపు చూడలేని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణ ప్రజలే కాదు ప్రజా ప్రతినిధులకు కూడా తప్పడం లేదు. సోమవారం యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిష్త్ కన్నుమూశారు. మంగళవారం స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని పౌరీ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఐతే కరోనా వ్యాప్తి నేపథ్యంలో తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నానని తెలిపారు యోగి ఆదిత్యనాథ్. తన తండ్రి కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నామని ఆయన బాధపడ్డారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సందేశం పంపారు యోగి ఆదిత్యనాథ్.

    నాన్న చివరి రోజుల్లో పక్కనే ఉండాలని నేను భావించా. కానీ యూపీలోని 23 కోట్ల మంది ప్రజలను కాపాడడం నా బాధ్యత. అందుకే నాన్నతో ఉండలేకపోయా. లాక్‌డౌన్ నేపథ్యంతో రేపు జరిగే అంత్యక్రియలకు కూడా హాజరుకాలేకపోతున్నా. అంత్యక్రియల సమయంలో సామాజిక దూరం పాటించాలని అమ్మను, కుటుంబ సభ్యులను కోరుతున్నా. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ఇంటికి వస్తా.
    యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం


    యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిష్త్ కొంతకాలగా కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. మార్చి 13న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఆయన కన్నుమూశారు. డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ కాపడలేకపోయారు. ఆనంద్ సింగ్ బిష్త్ గతంలో ఉత్తరాఖండ్ అటవీ శాఖల ఫారెస్ట్ రేంజర్‌గా విధులు నిర్వర్తించారు. ఆయన మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌‌కు సానుభూతి తెలిపారు. ఐతే ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో యూపీ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని.. దానికి తోడు లాక్‌డౌన్ కారణంగా తండ్రి అంత్యక్రియలకు వెళ్లలేకపోతున్నానని చెప్పారు యోగి ఆదిత్యనాథ్.

    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు