Home /News /coronavirus-latest-news /

YCP MP VIJAYASAI REDDY SENSATIONAL TWEET ON TDP LEADER CHANDRA BABU NAIDU FOR NEW VARIANT VIRUS NGS

Andhra Pradesh: ఏపీలో ఉన్నది N440 కాదు.. N420 వైరస్.. ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(ఫైల్ ఫోటో)

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(ఫైల్ ఫోటో)

ఏపీలో ఏ వైరస్ ఉంది. ఎందుకు ఇప్పుడు ప్రజలు అంతలా భయపడాల్సి వస్తోంది. విపక్షాలు మాత్రం ఎన్ 440 కె వేరియంట్ వల్లే ఏపీలో ఈ పరిస్థితి నెలకొంది అంటే.. వైసీపీ ఎంపీ మాత్రం ఏపీలో ఉన్నది ఎన్440కె కాదని.. అంటున్నారు. ఏపీలో ఇంకా ఎన్420 వైరస్ లక్షణాలు ఉన్నాయంటూ సంచలన ట్వీట్ చేశారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ లో ఏ వైరస్ ఉంది అన్నదానిపై రచ్చ రచ్చ అవుతోంది. విపక్ష నేత చంద్రాబు ఏపీలో N440K వైరస్ ఉందని.. ఇది చాలా ప్రమాదకరమైంది అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించే ప్రయత్నం చేశారు. అయితే దీనిపై అధికార పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఏపీలో ప్రమాదకరమైన వైరస్ లేదని.. చంద్రబాబు కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపడుతున్నారు. చంద్రబాబు కారణంగానే ఇతర రాష్ట్రాలు ఏపీపై ఆంక్షలు పెడుతున్నాయని.. ఇలా వైరస్ పేరుతో అసత్య ప్రచారాలు సరైనవి కావని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కర్నూల్లో చంద్రబాబుపై తాజాగా కేసు కూడా నమోదైంది. కర్నూలులో N440K పుట్టిందని చంద్రబాబు చెప్పడంతో ఇక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు అంటూ కేసు నమోదు చేశారు..

    ఇతర రాష్ట్రాల ఆంక్షలు ఎలా ఉన్నా.. ప్రస్తుతం ఏపీలో ఉన్నది ఏ వైరస్ అన్న చర్చ పెద్ద రచ్చకు దారి తీసింది. దీనిపై తాజాగా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. సీసీఎంబీ రిపోర్టు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు గోబెల్స్ ప్రచారం ఆపడం లేదని మండిపడ్డారు. అయితే ఏపీలో N440K వైరస్ వేరియెంట్ ప్రబలిందంటూ NARA-420 వైరస్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్ పారిపోయినా N420 వైరస్ ఆనవాళ్లు మాత్రం రాష్ట్రంలో ఇంకా అక్కడక్కడా ఉన్నాయి అంటూ మండిపడ్డారు.. ప్రజల్ని భయపెట్టడమే పనిగా పెట్టుకుందీ ఈ జూమ్ భూతం అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. 

    అక్కడితో ఆగకుండా వరుస ట్వీట్ల వర్షం కురిపించారు. బాబు జూమ్ సొల్లును గతంలో వందల కోట్ల ప్రయోజనం పొందిన ఎల్లో మీడియా తప్ప ఎవరూ ఫాలో అవడం లేదన్నారు. అదేదో అధికారులకు డైరెక్షన్లిచ్చే సీరియస్ మీటింగులా బిల్డప్పులు. ఖాళీగా కూర్చుంటే వ్యాధులు ముదిరిపోతాయని సైకియాట్రిస్టులు చెప్పిన మీదటే తనకు తాను వర్క్ క్రియేట్ చేసుకుంటున్నారు అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. ఊఏచంద్రంకు ఓ వారం అధికారమిస్తే కరోనాను ఖతం చేస్తాడంటూ పచ్చనేతలు డబ్బా కొడుతున్నారని, రేపు కరోనాపై కరాటే అంటారేమో? దోమలపై దండయాత్ర, నీరు - చెట్టు స్కీం అంటూ కోట్లు బొక్కేశారని. రెండు రెయిన్ గన్లు తెచ్చి కరువును ఖతం చేశామన్నారు. ఇవన్నీ చూసే ప్రజలు మిమ్మల్ని పాతాళంలో పాతరేశారు అంటూ సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఏపీలో ఇలా అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య వైరస్ వార్ నడుస్తోంది. రాష్ట్రంలో ఎన్ 440కే వేరియంట్ వైరస్‌ను గతంలోనే కర్నూలులో గుర్తించారని.. ఇది వ్యాప్తిలో ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇది పాత కరోనా వైరస్‌ వేరియంట్‌తో పోలిస్తే చాలా ప్రమాదకరమని చంద్రబాబు అన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ హైకోర్టు కూడా ప్రస్తావించిందని తెలిపారు. అయితే వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు అసత్య ప్రచారాలతో ప్రలను భయపెడుతున్నారంటూ మండిపడుతున్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Chandrababu naidu, Corona cases, Coronavirus, Vijayasai reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు