కరోనా కరాళ నృత్యంతో వణుకుతున్న ప్రపంచం.. అమెరికాలో మృత్యువు నాట్యం..

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 20,82,822 కేసులు నమోదు కాగా.. 1,34,603 మంది చనిపోయారు. ఒక్క అమెరికాలోనే మొత్తం 6,44,089 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

news18-telugu
Updated: April 16, 2020, 6:33 AM IST
కరోనా కరాళ నృత్యంతో వణుకుతున్న ప్రపంచం..  అమెరికాలో మృత్యువు నాట్యం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
క్షణ క్షణం వేలకు వేలు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. నిమిషాల్లో వందల మంది శవాలుగా.. కంటికి కనిపించని దానితో మనిషి జీవన్మరణ పోరాటం.. కళ్ల ముందే కకావికలం చేస్తోంది.. చాప కింద నీరులా ప్రపంచమంతా పాకి, గజగజ వణికిస్తోంది.. కరాళ నృత్యం చేస్తూ ప్రాణాలు తీస్తోందీ కరోనా. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 20,82,822 కేసులు నమోదు కాగా.. 1,34,603 మంది చనిపోయారు. ఒక్క అమెరికాలోనే మొత్తం 6,44,089 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో నిన్న ఒక్క రోజే 30,206 కేసులు నమోదయ్యాయి. ఇక.. ఆ దేశంలో మొత్తం 28,529 మంది కరోనాతో మృతి చెందగా.. నిన్న ఒక్క రోజే 2,482 మంది మరణించారు. ఆ దేశంలో చోటుచేసుకున్న మొత్తం మరణాల్లో న్యూయార్క్‌లోనే 10వేల మందికి పైగా చనిపోయారు.

అటు.. ఫ్రాన్స్‌లో నిన్న 1,438, స్పెయిన్‌లో 557 మంది, ఇటలీలో 578, యూకేలో 761, జర్మనీలో 309, బెల్జియంలో 283, బ్రెజిల్‌లో 225, నెదర్లాండ్స్‌లో 189, స్వీడన్‌లో 170, టర్కీలో 115, కెనడాలో 107 మంది చనిపోయారు.

కరోనా ప్రపంచవ్యాప్త గణాంకాలు..
మొత్తం పాజిటివ్ కేసులు 20,82,822
మరణాలు 1,34,603
కోలుకున్నవారు 5,10,046
ఆస్పత్రుల్లో ఉన్న వారు 14,38,173క్రిటికల్ పొజిషన్‌లో ఉన్నవారు 51,160
Published by: Shravan Kumar Bommakanti
First published: April 16, 2020, 6:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading