కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా బ్రిటన్‌లో తొలి మరణం నమోదు కావడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కొత్త వేరియంట్ కారణంగా ఆస్పత్రుల్లో చేరే వారే సంఖ్య పెరుగుతుండటంతో.. మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఇదే సమయంలో ఒమిక్రాన్ గురించి మరింత స్పష్టమైన సమాచారం కోసం ఇంకా డేటా అవసరమని డబ్ల్యూహెచ్వొ తెలిపింది. ఒమిక్రాన్‌కు సంబంధించిన సాధ్యమైనంత ఎక్కువ డేటా సేకరణ చేయాలని ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్వొ విజ్ఞప్తి చేసింది. ఈ కరోనా కొత్త వేరియంట్ ప్రపంచంపై తన ముద్ర వేయగలదని సంస్థ ఆందోళన చెందుతోంది. అయితే దాని గురించి ఏదైనా ఇప్పుడే చెప్పడం తొందరపడినట్టే అవుతుందని పేర్కొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం వచ్చినప్పుడే.. దీని గురించిన అసలు విషయం వెలుగులోకి వస్తుందని తెలిపింది.
మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్.. వ్యాక్సిన్ ప్రభావాన్ని మరింత వేగంగా వ్యాప్తి చేయడంతో తగ్గిస్తాయని ఓ అధ్యయనం అంచనా వేసింది. మరోవైపు డెల్టా వేరియంట్ కంటే ఓమిక్రాన్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ తక్కువ ప్రాణాంతకం అని కూడా తెలియజేసింది. ఒమిక్రాన్ సోకిన వ్యక్తిలో కనిపించే లక్షణాలు డెల్టాలో కంటే చాలా తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ అధ్యయనం ప్రకారం, రెండు-డోస్ టీకా ఓమిక్రాన్‌కు వ్యతిరేకంగా తగినంత యాంటీబాడీలను ఉత్పత్తి చేయదని వెల్లడైంది. బ్రిటీష్ శాస్త్రవేత్తలు ముందుగా టీకాలు వేసిన వ్యక్తులలో ఓమిక్రాన్ సంక్రమణను పెంచుతుందని కనుగొన్నారు.
ఒమిక్రాన్ తీవ్రమైన ఇన్ఫెక్షన్ కాదని.. ఇప్పటివరకు నివేదించబడిన కేసులలో వ్యాధి సోకిన వ్యక్తిలో లక్షణాలు తీవ్రంగా ఉన్నట్లు కనుగొనబడలేదు. ఇది చాలా తేలికైనదని అనేక అధ్యయనాలు చెబుతున్నప్పటికీ.. ఇవన్నీ ఇప్పటివరకు అందిన సమాచారం ఆధారంగా చెబుతున్న విషయాలే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అందుకే ఇప్పటివరకు చేసిన అధ్యయనం ఆధారంగా ఎలాంటి నిర్ధారణకు రావడం సరికాదని చెబుతోంది.
Breaking News: ప్రపంచంలో ఒమిక్రాన్ కారణంగా తొలి మరణం నమోదు..
ఒమిక్రాన్ వ్యాప్తిని తగ్గించేందుకు ప్రపంచ దేశాలన్నీ ప్రజలు కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలని సూచించింది. ఇక భారత్‌లోనూ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 50కు చేరువవుతోంది. అయితే మన దేశంలో ఈ కొత్త వేరియంట్ సోకిన వ్యక్తులెవరికీ తీవ్ర లక్షణాలు లేవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ వారిని విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Omicron corona variant