22 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. లక్షా 50వేల మరణాలు..

Global Corona Cases : కరోనా కేసులు ఒక్క రోజులోనే మరో లక్షకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసులు 22 లక్షలకు చేరువయ్యాయి. అటు.. కరోనా వల్ల లక్షా 50 వేల మంది చనిపోయారు.

news18-telugu
Updated: April 17, 2020, 6:20 AM IST
22 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. లక్షా 50వేల మరణాలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా కేసులు ఒక్క రోజులోనే మరో లక్ష దాటాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసులు 22 లక్షలకు చేరువయ్యాయి. అటు.. కరోనా వల్ల లక్షా 50 వేల మంది చనిపోయారు. ఈ మహమ్మారి వైరస్ నుంచి 5.5 లక్షల మంది కోలుకున్నారు. అత్యధికంగా అమెరికాలో 6.77 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే కొత్తగా 29 వేల కేసులు నమోదయ్యాయి. అక్కడ మొత్తం 35 వేల మంది కరోనా బారిన పడి చనిపోయారు. నిన్న ఒక్క రోజే 2137 మంది మరణించారు. అమెరికా తర్వాత యూకేలో నిన్న 861 మంది, ఫ్రాన్స్‌లో 753 మంది, ఇటలీలో 525 మంది, స్పెయిన్‌లో 503 మంది, బెల్జియంలో 417 మంది, జర్మనీలో 248 మంది, బ్రెజిల్‌లో 190 మంది, కెనడాలో 181 మంది నెదర్లాండ్స్‌లో 181 మంది, స్వీడన్‌లో 130 మంది, టర్కీలో 125 మంది మృతి చెందారు.

ప్రపంచవ్యాప్త కరోనా గణాంకాలు:

మొత్తం కేసులు 21,80,617
మరణాలు 1,45,429
కోలుకున్నవారు 5,46,777
యాక్టివ్ కేసులు 14,88,411
క్రిటికల్ కండీషన్‌లో ఉన్నవారు 56,602
Published by: Shravan Kumar Bommakanti
First published: April 17, 2020, 6:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading