ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక్క రోజే లక్ష మందికి..

కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లోనే లక్ష మందిని ఈ మహమ్మారి ఆవహించింది. తాజా లెక్కల ప్రకారం నిన్న ఒక్క రోజే 1,01,876 మందికి కరోనా సోకింది.

news18-telugu
Updated: May 21, 2020, 6:40 AM IST
ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక్క రోజే లక్ష మందికి..
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు (credit - WHO)
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లోనే లక్ష మందిని ఈ మహమ్మారి ఆవహించింది. తాజా లెక్కల ప్రకారం నిన్న ఒక్క రోజే 1,01,876 మందికి కరోనా సోకింది. మొత్తంగా 50 లక్షల మందికి కరోనా సోకింది. ఆ లెక్క 50,82,661గా ఉంది. మొత్తం 3,29,294 మందిని ఈ వ్యాధి బలి తీసుకుంది. నిన్న ఒక్క రోజే 4,923 మంది మరణించారు. ఇక, 20,20,157 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 27,33,210 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో 45,803 మంది పరిస్థితి సీరియస్‌గా ఉంది. దేశాల వారీగా చూస్తే అమెరికా పరిస్థితి దారుణంగానే ఉంది. అక్కడ నిన్న ఒక్క రోజే 1,461 మంది చనిపోయారు. కొత్తగా 21,408 కేసులు నమోదయ్యాయి. అమెరికాలో మొత్తం ఇప్పటి వరకు 94,994 మంది కరోనా వల్ల మృతి చెందారు. ఆ దేశంలో మొత్తం కేసులు 16 లక్షలకు చేరువలో ఉన్నాయి.

ఇక, మొత్తం కేసుల సంఖ్యలో భారత్ 11వ స్థానంలో, మరణాల సంఖ్యలో 13వ స్థానంలో ఉంది. మరణాల్లో అమెరికా తొలి స్థానంలో ఉండగా, యూకే (35,704), ఇటలీ (32,330) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నిన్న బ్రెజిల్‌లో 911 మంది మృతి చెందారు. యూకేలో 363, మెక్సికోలో 334, ఇటలీలో 161, రష్యాలో 135, కెనడాలో 119, ఫ్రాన్స్‌లో 110, స్పెయిన్‌లో 110, పెరూలో 110 మంది మరణించారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: May 21, 2020, 6:40 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading