దేశంలో ఫేస్ మాస్క్ నిబంధన రద్దు...అదే రోజు దేశ అధ్యక్షుడికి కరోనా పాజిటివ్...

బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో కరోనావైరస్ బారిన పడినట్లు గుర్తించారు. కోవిడ్ -19 లక్షణాలతో బోల్సోనారో తీవ్రంగా జ్వరంతో బాధపడుతున్నారు.

news18-telugu
Updated: July 7, 2020, 9:55 PM IST
దేశంలో ఫేస్ మాస్క్ నిబంధన రద్దు...అదే రోజు దేశ అధ్యక్షుడికి కరోనా పాజిటివ్...
బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో
  • Share this:
బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో కరోనావైరస్ బారిన పడినట్లు గుర్తించారు. కోవిడ్ -19 లక్షణాలతో బోల్సోనారో తీవ్రంగా జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు సోమవారం పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆయనకు పాజిటివ్ గా తేలింది. అయితే కరోనా వైరస్ ప్రమాదాన్ని సాధారణ ఫ్లూగా బోల్సోనారో గతంలో తక్కువ అంచనా వేస్తూ బహిరంగ ప్రకటనలు చేశారు. అంతేకాదు ఈ వైరస్ పెద్దగా ప్రభావితం చేయదని ఆయన చాలాసార్లు బహిరంగంగా చెప్పారు.

ఇది మాత్రమే కాదు, లాక్ డౌన్ ప్రకటించి విశ్రాంతి ఇవ్వమని ప్రావిన్స్ గవర్నర్లు బోల్సోనారోను చాలాసార్లు కోరారు. అయితే లాక్ డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థకు హాని కలిగిస్తుందని ఆయన అన్నారు. అంతేకాదు ఫేస్ మాస్క్‌లు ధరించే నిబంధనను కూడా బోల్సోనారో సోమవారం రద్దు చేశారు.
Published by: Krishna Adithya
First published: July 7, 2020, 9:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading