రోడ్డుపైనే మహిళా వలస కూలీ ప్రసవం.. ఆ తర్వాత కాలినడక 150 కిలోమీటర్లు

మహారాష్ట్ర నుంచి తమ స్వస్థలమైన మధ్యప్రదేశ్‌లోని సత్నాకు చేరుకునేందుకు కాలినడక ప్రారంభించారు. అయితే ఎక్కువ దూరం నడవడం వల్ల మార్గమధ్యంలోనే ప్రసవ నొప్పులు మొదలయ్యాయి.

news18-telugu
Updated: May 13, 2020, 9:33 AM IST
రోడ్డుపైనే మహిళా వలస కూలీ ప్రసవం.. ఆ తర్వాత కాలినడక 150 కిలోమీటర్లు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కూలీలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. తమ స్వస్థలాలకు చేరుకునేందుకు వందల కిలోమీటర్లు రోజుల తరబడి కాలినడకతోనే చేరుకుంటున్నారు. తాజాగా కాలినడకన స్వస్థలానికి వెళ్లేందుకు ఓ నిండు గర్భిణిని తర భర్తతో కలిసి బయలుదేరింది. మహారాష్ట్ర నుంచి తమ స్వస్థలమైన మధ్యప్రదేశ్‌లోని సత్నాకు చేరుకునేందుకు కాలినడక ప్రారంభించారు. అయితే ఎక్కువ దూరం నడవడం వల్ల మార్గమధ్యంలోనే ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. దీంతో రోడ్డుపైనే సదరు మహిళా వలస కూలీ ప్రసవించింది. అక్కడే రెండు గంటల పాటు ఉండి.. అనంతరం తిరిగి మళ్లీ అప్పుడే పుట్టిన పాపతో మరో 150 కిలోమీటర్లు నడిచింది. సత్నా సరిహద్దులో వారిని గుర్తించిన అధికారులు వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులను తరలించేందుకు శ్రామిక్ రైళ్లు నడుపుతున్నప్పటికీ వలస కార్మికులు ఎక్కేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
First published: May 13, 2020, 9:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading