గ్రాండ్‌గా మ్యారేజ్... వధువు ఒడిలో ల్యాప్‌టాప్... ఏం చేస్తోంది?

ఇదివరకు పెళ్లిళ్లలో మహా అయితే మొబైల్ వాడేవాళ్లు. ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు కూడా వాడేస్తున్నారు. వధువు ఒడిలో ల్యాప్‌టాప్ ఎందుకుంది?

news18-telugu
Updated: July 7, 2020, 7:42 AM IST
గ్రాండ్‌గా మ్యారేజ్... వధువు ఒడిలో ల్యాప్‌టాప్... ఏం చేస్తోంది?
గ్రాండ్‌గా మ్యారేజ్... వధువు ఒడిలో ల్యాప్‌టాప్... ఏం చేస్తోంది? (credit - twitter)
  • Share this:
కరోనా వైరస్ వచ్చాక... ప్రొఫెషనల్స్‌కి టెక్నాలజీ వాడకం బాగా పెరిగిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ... ల్యాప్‌టాప్‌లలోనే పని కానిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లు పెట్టుకొని మాట్లాడుకుంటున్నారు. పెళ్లిళ్ల విషయంలోనూ అంతే... పెళ్లికి వెళ్లకపోయినా... ఆన్‌లైన్‌లో ఎంట్రీ ఇచ్చి... కంగ్రాట్స్ చెప్పి సరిపెట్టేస్తున్నారు. పని మానలేం... అలాగని కరోనాకు ఛాన్స్ ఇవ్వలేం. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన రోజులివి. ఐతే... పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్... రెండూ వేరువేరు. ఆ రెండింటినీ కలిపితే సమస్యే. కొంతమంది మాత్రం... పర్సనల్ లైఫ్‌లో కూడా ప్రొఫెషన్‌ను తెచ్చుకొని ఇబ్బంది పడతారు.

తాజాగా ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో... వధువు... వరుడి పక్కన కూర్చొని... ఒళ్లో ల్యాప్‌టాప్ పెట్టుకొని పనిచేసుకుంటోంది. గ్రాండ్ మ్యారేజ్. కాస్ట్‌లీ కాస్ట్యూమ్స్... అంతా సందడిగా ఉంటే... ఆమె మాత్రం... ఓవైపు ఫోన్‌లో మాట్లాడుతూ... మరోవైపు... ల్యాప్‌టాప్‌లో జూమ్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంది. పెళ్లి సందర్భంగా ఫ్రెండ్స్ కంగ్రాట్స్ చెబుతుంటే... వరుడి సంగతి వదిలేసి... అందులో మునిగిపోయింది.





చాలా మంది ఈ వీడియో చూసి... ఆమె అలా చెయ్యడం కరెక్టు కాదంటున్నారు. జీవితంలో ఒకేసారి వచ్చే పెళ్లిని ఎంజాయ్ చెయ్యడం మానేసి... ఆ ప్రొఫెషన్ గోల ఏంటని అంటున్నారు. ఐతే... కచ్చితంగా ఆమె ల్యాప్‌టాప్‌లో ఏం చేస్తోందన్నది తెలియలేదు. చాలా మంది జూమ్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటోందని అంటున్నారు. పాపం ఆ పెళ్లి కొడుకు మాత్రం... తనను పట్టించుకోవట్లేదని బిత్తర చూపులు చూస్తున్నాడు.
Published by: Krishna Kumar N
First published: July 7, 2020, 7:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading