వండర్‌ఫుల్... CNN-News18‌కు ప్రధాని మోదీ అభినందన...

ప్రధాని నరేంద్ర మోదీ

నెట్ వర్క్ 18లో భాగమైన CNN-News18 చేపట్టిన కార్యక్రమాన్ని ప్రధాని మోదీ అభినందించారు.

  • Share this:
    నెట్ వర్క్ 18లో భాగమైన CNN-News18 చేపట్టిన కార్యక్రమాన్ని ప్రధాని మోదీ అభినందించారు. ఏప్రిల్ 5వ తేదీన రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇళ్లలో లైట్లు ఆర్పి కొవ్వొత్తులు, సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్లు వేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రజలను ఏకం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేసేందుకు CNN-News18 వంద నగరాల్లో వంద మంది రిపోర్టర్లతో లైవ్ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేసింది. కరోనా వైరస్ లాంటి మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా పంజా విసురుతున్న సమయంలో ప్రజల్లో మనోధైర్యం నింపేందుకు ప్రధాని చేపట్టిన కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకుని వెళ్లేందుకు CNN-News18 చేపట్టిన ప్రయత్నాన్ని ప్రధాని మోదీ అభినందించారు. అద్భుతమైన కార్యక్రమం అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

    Published by:Ashok Kumar Bonepalli
    First published: