Covid-19: ఆ విషయంలో మగవారి కంటే ఆడవాళ్లే బెటర్ అట..

కరోనా తీసుకొచ్చిన సంక్షోభం అంతా ఇంతా కాదు. ముఖానికి మాస్కు, జేబులో శానిటైజర్ లేనిదే బయటకు అడుగుపెట్టడానికి జనాలు భయపడుతున్నారు. పరిశుభ్రతపై అవగాహన లేని వాళ్లకు కూడా ఎలా ఉండాలో కరోనా పాఠాలను నేర్పుతున్నది.

news18
Updated: October 8, 2020, 4:15 PM IST
Covid-19: ఆ విషయంలో మగవారి కంటే ఆడవాళ్లే బెటర్ అట..
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 8, 2020, 4:15 PM IST
  • Share this:
ప్రపంచ మహమ్మారి కరోనా తీసుకొచ్చిన సంక్షోభం అంతా ఇంతా కాదు. ప్రజల దైనందిన జీవితాల్లోనూ ఇది సమూల మార్పులు తీసుకొచ్చింది. అంతకుముందు ప్రపంచానికి దాదాపుగా అలవాటు లేని ముఖానికి మాస్కులు ధరించడం, తరుచూ చేతులు కడుక్కోవడం వంటివి కరోనా పుణ్యమా అని అందరూ పాటిస్తున్నారు. అయితే ఈ విషయంలోనూ మగవారి కంటే ఆడవాళ్లే బెటర్ అట. మగవాళ్లు మాస్కులు ధరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారట. పురుషులతో పోల్చితే మహిళలే మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్లు ఉపయోగించి నిత్యం చేతులు కడుక్కోవడం వంటివి మహిళలే ఎక్కువగా చేస్తున్నారని ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది. యూఎస్ కు చెందిన యేల్ యూనివర్సిటీ పరిశోధకులు బిహేవియరల్ సైన్స్ & పాలసీ అనే పరిశోధన పత్రంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

దీని ప్రకారం.. పురుషులతో పోల్చితే మహిళలు సామాజిక దూరం నిబంధనలు పాటించడం, ముఖానికి మాస్కులు ధరించడం, తరుచూ శానిటైజర్ ను ఉపయోగించి చేతులు కడుక్కోవడం వంటివి చేస్తారు. అంతేగాక ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ.. నిపుణులు చెప్పినట్టు నడుచుకోవడంలో ఆడవాళ్లే ముందున్నారు. ఇదే విషయం మీద పరిశోధన చేస్తున్నపరిశోధకులు ఇర్మాక్ ఓల్మెసాయ్ స్పందిస్తూ. .. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేయకముందే ఈ పరిశోధన చేశామని, అందులో మహిళలు తమ దైనందిన జీవితాల్లో తరుచూ వైద్యులను సంప్రదిస్తారని తెలిపారు. ఆరోగ్యం పట్ల వారికి కేర్ ఎక్కువగా తీసుకుంటారని, ఈ విషయంలో పురుషులు అంతగా పట్టించుకోరని అన్నారు. మహిళలు తమ ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ చూపుతారు కాబట్టే ఈ వైరస్ సంక్రమించినవారిలో మగవారితో పోలిస్తే వారి సంఖ్య తక్కువగా ఉంటుందని వివరించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి వాళ్లు తగినన్ని ప్రయత్నాలు చేశారని కొనియాడారు.



ముఖానికి ముసుగు వేసుకోమని పలువురు మగవారిని అడిగితే వాళ్లు కోపంగా చూశారని తమ అధ్యయనంలో తేలిందన్నారు. ఇటీవల పలువురు దేశాధినేతలు కూడా మాస్కులు ధరించమని అడిగితే ఎలా కోప్పడ్డారో ప్రపంచమంతా చూసిందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనారో వంటి పలువురు నాయకులు తమ దుందుడుకు వైఖరితో అబాసుపాలైన విషయం తెలిసిందే. వీరిరువురు కరోనా బారిన పడ్డవారే కావడం విశేషం.

కాగా, పై అధ్యయనం నిర్వహించడానికి గానూ అమెరికాలో 800 కుటుంబాలను ప్రశ్నించి.. నివేదిక తయారుచేశారు. ఇంట్లో ఉండే సమయంలో వారి ధోరణి ఎలా ఉంటుంది..? తరుచూ చేతులు కడుక్కుంటారా.. లేదా..? బయటకు వెళ్తే మాస్కులు ధరిస్తారా..? అనే ప్రశ్నలు అడిగారు. ఈ ఏడాది మార్చి 9 నుంచి మే 29 వరకు ఈ సర్వేను నిర్వహించారు.
Published by: Srinivas Munigala
First published: October 8, 2020, 4:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading