Home /News /coronavirus-latest-news /

Hyderabad: ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లిపోయిన మహిళ.. కరోనా అని తేలడంతో అధికారుల్లో టెన్షన్.. చివరకు..

Hyderabad: ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లిపోయిన మహిళ.. కరోనా అని తేలడంతో అధికారుల్లో టెన్షన్.. చివరకు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad: జర్మనీ నుంచి వచ్చిన ఓ మహిళ.. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి అధికారులు, పోలీసుల కళ్లుగప్పి ఇంటికి వెళ్లిపోయింది.

    కరోనా కొత్త వేరియంట్ విషయంలో ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తుంటే.. మరోవైపు కొందరు ఈ విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశాలు నుంచి, అందులోనూ ఒమిక్రాన్ వేరియంట్ కేసుల నమోదైన దేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించే విషయంలో అధికారులు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే జర్మనీ నుంచి వచ్చిన ఓ మహిళ.. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి అధికారులు, పోలీసుల కళ్లుగప్పి ఇంటికి వెళ్లిపోయింది. ఆమెకు పరీక్షలు నిర్వహించిన అధికారులు.. కరోనా పాజిటివ్ అని తేలడంతో టిమ్స్‌కు తరలించడానికి సిద్ధమయ్యారు. అయితే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోవడంతో వారిలో ఆందోళన మొదలైంది.

    అయితే ఆ మహిళ పాస్‌పోర్టులోని అడ్రస్‌ ఆధారంగా కుత్బుల్లాపూర్ పరిధిలో ఆమె ఇల్లు ఉన్నట్టు గుర్తించారు. వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లోని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అధికారులు ఆమె నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లి ఆ మహిళకు నచ్చజెప్పారు. ఆమెను టిమ్స్‌కు తరలించారు. ఆమెకు కరోనా పాజిటివ్‌కు రావడంతో.. ఆమె తల్లిదండ్రులను కూడా ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. మిగతా వారితో పాటే ఈ మహిళ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. ఒకవేళ ఈ మహిళకు కరోనా ఒమిక్రాన్ వేరియంట్ అని తేలితే.. ఆమెకు సంబంధించి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను కూడా ట్రేస్ చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు.

    పలు దేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన విదేశీ ప్రయాణికుల్లో 11 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ రోజు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగిన వారికి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా కరోనా బారినపడ్డట్లు అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు వారిని గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ 11 మంది ప్రయాణికుల్లో బ్రిటన్ నుంచి నుంచి తొమ్మిది మంది, సింగపూర్‌, కెనడా, అమెరికా నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. వీరి నుంచి నమూనాలను సేకరించి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపారు.ఇక నిన్న బ్రిటన్‌ నుంచి వచ్చిన రంగారెడ్డి జిల్లా వాసికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో.. వారిని టిమ్స్‌కు తరలించారు. దీంతో విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా నిర్ధారణ అయిన సంఖ్య 12కు చేరుకుంది.

    Weight Loss: బరువు తగ్గాలని ట్రై చేస్తున్నారా.. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా చేయండి

    మీరు నాన్ వెజ్ తినరా ?.. అయితే ప్రొటీన్లు పుష్కలంగా లభించే ఈ ఆహారాలను తీసుకోండి..

    Omicron: దేశంలో కరోనా ఒమిక్రాన్ సోకిన ఆ ఇద్దరి పరిస్థితి ఏంటి ? అసలు ఆ ఇద్దరు ఎవరు ?

    ఇండియాలోకి ప్రవేశించిన కరోనా ఒమైక్రాన్.. రెండు కేసులు నమోదు

    నిన్న కర్నాటకలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నమోదైన తరువాత చాలామందిలో ఆందోళన మొదలైంది. కోవిడ్ కొత్త వేరియంట్ సోకిన దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ వేరియంట్‌ను ఆందోళన కలిగించే వైరస్‌గా పేర్కొనడంతో.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి తలెత్తుతున్న పలు ప్రశ్నల జాబితాను విడుదల చేసింది. ఒమిక్రాన్ గురించి ప్రజలు భయపడవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. భారత్‌లో ఒమిక్రాన్ సోకిన ఒక రోగి వయస్సు 66 సంవత్సరాలు, మరొకరి వయస్సు 46 సంవత్సరాలు. వారిలో ఒకరు దక్షిణాఫ్రికా పౌరుడు కాగా, మరొకరు స్థానిక వైద్యుడు. ఈ సమయంలో టీకాలు వేయడం, జీనోమ్ సీక్వెన్సింగ్ మరియు ప్రయాణ నియమాలలో అప్రమత్తత ద్వారా దీనిని ఎదుర్కోవచ్చని కోవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Coronavirus, Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు