HOME »NEWS »Corona vilayatandavam »woman named her baby who served her during delivery ak gh

Covid-19: కరోనా సోకిన గర్భిణికి సేవలు.. బదులుగా ఆమె ఏం చేసిందంటే..

Covid-19: కరోనా సోకిన గర్భిణికి సేవలు.. బదులుగా ఆమె ఏం చేసిందంటే..
ప్రతీకాత్మక చిత్రం

ప్రసవం కోసం సాఫ్నాకు సిజేరియన్ చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. దీంతో ఆమె బాగోగులు చూసుకునేందుకు సోఫియా హాస్పిటల్‌కు చేరుకుంది.

  • Share this:
కరోనా వైరస్ మానవ సంబంధాలను ఎంతగానో దెబ్బతీసింది. మహమ్మారి వెలుగు చూసిన కొత్తలో వైరస్ సోకిన వారిని సొంతవారు సైతం పట్టించుకోలేదు. వారి దగ్గరకి వెళ్లేందుకు, బాగోగులు చూసుకునేందుకు కుటుంబ సభ్యులు కూడా భయపడ్డారు. కానీ క్రమంగా కరోనాపై అపోహలన్నీ దూరమవ్వడంతో ప్రజలు సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నారు. తాజాగా కరోనా సోకిన గర్భిణికి సేవలందించి వార్తల్లో నిలిచింది ఒక మహిళ. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలోని పొత్తోర్ కొజికున్‌ (Pottor Kozhikunnu)కు చెందిన సోఫియా, జుఫికల్ అలి ఇద్దరూ లాయర్లు. వీరు అయ్యంథోల్‌ (Ayyanthole) డిస్ట్రిక్ కోర్టులో లాయర్లుగా పనిచేస్తున్నారు.

ఇటీవల జుఫికర్ అలి, అతడి భార్య సాఫ్నా, వారి నలుగురు పిల్లలకు కూడా కరోనా సోకింది. అప్పటికే సాఫ్నా నిండు గర్భంతో ఉంది. ఆమెకు నెలలు నిండటంతో ప్రసవం కోసం మెడికల్ కాలేజ్‌లోని కోవిడ్ వార్డులోకి తరలించారు. కరోనా భయంతో వీరి బంధువులు ఎవరూ ప్రసవం సమయంలో ఆమెకు సాయం చేసేందుకు, తోడుగా ఉండేందుకు ముందుకు రాలేదు. కానీ జుఫికర్ ద్వారా విషయం తెలుసుకున్న సోఫియా, సాఫ్నాకు తోడుగా ఉండేందుకు ముందుకు వచ్చింది.



ప్రసవం కోసం సాఫ్నాకు సిజేరియన్ చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. దీంతో ఆమె బాగోగులు చూసుకునేందుకు సోఫియా హాస్పిటల్‌కు చేరుకుంది. కోవిడ్-19 సోకిన రోగికి సేవలందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తునట్లు ఆమె హాస్పిటల్ యాజమాన్యానికి ఒక డిక్లరేషన్ కూడా ఇచ్చింది. మాస్కు మాత్రమే ధరించి సాఫ్నా ఉండే వార్డులోకి వెళ్లింది. డెలివరీ చేసిన రెండు రోజుల తరువాత సాఫ్నాకు కోవిడ్-19 నెగటివ్ వచ్చింది. సాఫ్నాకు, ఆమె బిడ్డకు సోఫియా ఐదు రోజుల పాటు అండగా నిలిచింది. కరోనాకు భయపడకుండా క్లిష్ట సమయంలో తల్లీబిడ్డల సంరక్షణ బాధ్యతలను చూసుకొని ఆదర్శంగా నిలిచింది. సాఫ్నాకు అత్యంత దగ్గరగా ఉన్నా నవజాత శిశువుకు, సోఫియాకు కరోనా సోకకుండా జాగ్రత్తపడ్డారు.

బిడ్డకు వారి పేరు
సోఫియా రాకముందు, సాఫ్నాను కోవిడ్ వార్డులో చేర్పించినప్పుడు ఫర్హాద్ అనే మరో మహిళ ఆమెకు సేవలు చేసిందట. దీంతో వీరిద్దరికీ కృతజ్ఞతగా ఆ దంపతులకు పుట్టిన బిడ్డకు సోఫియా ఫర్హాద్ అనే పేరు పెట్టుకున్నారు. అయినవారు సైతం దగ్గరకి రాని సమయంలో ఈ ఇద్దరు మహిళలూ ఆదుకోవడం మంచి విషయమని వీరిని ప్రశంసిస్తున్నారు. సోఫియా ఇటీవల కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో యుడీఎఫ్‌ తరఫున పోటీచేసింది. కానీ కేవలం ఐదు ఓట్ల తేడాతో ఓడిపోయింది.
Published by:Kishore Akkaladevi
First published:January 05, 2021, 18:59 IST