మాస్క్ పెట్టుకోమంటే కానిస్టేబుల్‌ను కొరికిన మహిళ

కరోనా వైరస్ ప్రబలుతున్న వేళ.. మాస్క్ పెట్టుకోమని చెప్పినందుకు ఓ మహిళా కానిస్టేబుల్ మీద దాడి చేసి, ఆమె చేతిని కొరికింది ఓ మహిళ వలస కార్మికురాలు.

news18-telugu
Updated: May 27, 2020, 5:37 PM IST
మాస్క్ పెట్టుకోమంటే కానిస్టేబుల్‌ను కొరికిన మహిళ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ ప్రబలుతున్న వేళ.. మాస్క్ పెట్టుకోమని చెప్పినందుకు ఓ మహిళా కానిస్టేబుల్ మీద దాడి చేసి, ఆమె చేతిని కొరికింది ఓ మహిళ వలస కార్మికురాలు. మహారాష్ట్రలోని పాల్ గఢ్ జిల్లా వాసాయ్‌లో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మహారాష్ట్ర నుంచి వెళ్తున్న శ్రామిక్ రైల్లో వెళ్లేందుకు వందలాది మంది వలస కూలీలు వచ్చారు. ఆ సమయంలో అక్కడ అధికారులు చేపట్టాల్సిన ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. అక్కడున్న కూలీలు అందరూ వివిధ వరుసల్లో నిలబడి ఉన్నారు. తమను ఎప్పుడు పిలుస్తారా? అని ఎదురుచూస్తున్నారు. వారిలో ఓ మహిళా కూలీ మాస్క్ పెట్టుకోలేదు. శ్రామిక్ రైలు ఎక్కాలంటే తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాల్సిందే. రైలు ఎక్కేటప్పుడు సామాజిక దూరం కూడా పాటించాల్సిందే. మహిళ మాస్క్ పెట్టుకోకపోవడాన్ని చూసిన మహిళా కానిస్టేబుల్ ఆమెకు మాస్క్ పెట్టుకోవాలని సూచించింది. ఆ సమయంలో మహిళా కూలీ కానిస్టేబుల్ మీద దాడి చేసింది. చేతిని కూడా కొరికింది. నిందితురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఎవరినీ అరెస్ట్ చేయలేదు.

First published: May 27, 2020, 5:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading