రూ.5వేలు ఇవ్వు సార్... షాద్‌నగర్‌లో ఎస్ఐతో మహిళ వాగ్వాదం..

‘మేము సచ్చినా అసలు మీకు సంబంధమే లేదు. మమ్మల్ని వదిలి పెట్టండి’ అంటూ ఆ మహిళ డిమాండ్ చేసింది.

news18-telugu
Updated: March 28, 2020, 2:40 PM IST
రూ.5వేలు ఇవ్వు సార్... షాద్‌నగర్‌లో ఎస్ఐతో మహిళ వాగ్వాదం..
షాద్ నగర్‌లో ఎస్ఐతో మహిళ వాగ్వాదం
  • Share this:
నాలుగు మంచి మాటలు చెబితే వాటిని వినాల్సిన ప్రజలు అవి వినకుండా తమ మొండిపట్టు ప్రదర్శించి పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా ప్రజలు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. దేశమంతటా లాక్ డౌన్ కర్ఫ్యూ విధించడంతో జనజీవనం స్తంభించిపోయింది. అయినప్పటికీ సచ్చినా బ్రతికినా సొంత ఊరిలోనే ఎలాగైనా ఉండొచ్చు అన్న ధీమాతో రోడ్లపైకి ప్రజలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన గ్రామీణ వలస ప్రజలు రోడ్ల వాహనాలు దొరికితే సరే లేకపోతే కాలినడకన తమ సొంత గ్రామాలకు బయలుదేరి వస్తున్నారు. ఈ క్రమంలో శనివారం షాద్ నగర్ జాతీయ రహదారిపై ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ట్రాఫిక్ ఎస్ఐ రఘు కుమార్ కు వింత అనుభవం ఎదురయింది.

షాద్ నగర్ టోల్ ప్లాజా వద్ద గద్వాలకు చెందిన ఆటో గూడ్స్ ట్రాలీ వచ్చింది. ట్రాఫిక్ ఎస్ఐ రఘు కుమార్ తదితర సిబ్బంది గూడ్స్ ర్యాలీని ఆపారు. అందులో ఏకంగా 20 మందికి పైగా కిక్కిరిసి కూర్చున్నారు. ఇదేమిటని డ్రైవర్ ను ఎస్సై ప్రశ్నించారు. అయితే డ్రైవర్ తప్పయింది అంటూ బ్రతిమిలాడాడు. ట్రాలీ నుంచి ప్రజలను కిందకి దించారు. అందులో గద్వాలకు చెందిన ఓ మహిళ పోలీసులతో వాగ్వివాదానికి దిగింది. రోడ్డుపై ఆపిన ఎస్సై రఘు కుమార్ ను రూ.5000 ఇవ్వాలని సాక్షాత్తూ ట్రాఫిక్ ఎస్ఐను డిమాండ్ చేసింది. భోజనం పెట్టించాలి, రూ.5000 కావాలి అంటూ వాగ్వివాదానికి దిగింది. డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని రఘు కుమార్ చెప్పగా అందుకు మీరు ఇవ్వాలంటూ మహిళ తడుముకోకుండా సమాధానం చెప్పింది.

ఆమె అమాయకత్వానికి జాలి పడ్డ రఘు కుమార్ వారికి అర్థమయ్యే రీతిలో సముదాయించారు. ఈ పరిస్థితిలో ఇలా ప్రయాణాలు చేస్తూ వెళ్లడం సురక్షితం కాదని ఎవరికైనా కరోనా సోకితే చచ్చిపోతారని వివరించారు. దీనికి స్పందించిన మహిళ మేము సచ్చినా అసలు మీకు సంబంధమే లేదు. మమ్మల్ని వదిలి పెట్టండి అంటూ డిమాండ్ చేసింది. వారి అమాయకత్వానికి ఎస్సై రఘు కుమార్ ఎలాంటి విసుగు చెందకుండా ఆమెకు పూర్తిస్థాయిలో కరోనా వ్యాధి పట్ల వివరించారు. నీతో పాటు కుటుంబ సభ్యులు, ఆ తర్వాత సమాజం, దేశం ఈ వ్యాధితో నాశనం అయిపోతుందనీ, అందరినీ బ్రతికించాలి అనే మంచి నిర్ణయంతో ప్రభుత్వాలు మేము తాపత్రయం పడుతున్నామని మహిళకు వివరించగా ఆమె శాంతించింది.

డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అదేవిధంగా వెనుక వస్తున్న ఒక ఖాళీ బస్సును ఎస్ఐ రఘు కుమార్ ఆపి మానవతా దృక్పథంతో వారిని అందులో ఎక్కించారు. పిల్లాపాపలతో ఆ బస్సులో గ్రామీణ ప్రజలు బయలుదేరి వెళ్లారు.
First published: March 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading