తెలంగాణలో కరోనాతో మహిళ కన్నుమూత... గాంధీ ఆస్పత్రి ముందే...

నిన్నటి వరకు మొత్తం 7,70,764 టెస్టులు చేశారు.

తెలంగాణలో కరోనా వైరస్ వల్ల ఓ మహిళ చనిపోయింది.

  • Share this:
    తెలంగాణలో కరోనా వైరస్ వల్ల ఓ మహిళ చనిపోయింది. మూడు రోజుల నుంచి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు కరోనా పరీక్షలు నిర్వహించగా, ఆమెకు పాజిటివ్ వచ్చింది. దీంతో బాధితురాలిని ప్రైవేట్ ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, గాంధీ ఆస్పత్రి వద్దకు వచ్చినా ఆమెను వెంటనే చేర్చుకోలేదని తెలుస్తోంది. సుమారు రెండు గంటల పాటు గాంధీ ఆస్పత్రి బయటే ఆంబులెన్స్‌లో ఉంచిన తర్వాత బాధితురాలు చనిపోయినట్టు తెలిసింది. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 471కి చేరింది. మృతుల సంఖ్య 12కి చేరింది. 18 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 414 యాక్టివ్ కేసులున్నాయి. ఈ రోజు మరో 60-70 మంది డిశ్చార్జి అయ్యే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న రోగులంతా ఏప్రిల్ 22 వరకు డిశ్చార్జి అవుతారు.

    తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపు ఉండే అవకాశాలున్నాయని ముందే హింట్ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఆ దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏప్రిల్ 11వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో రాష్ట్ర కేబినెట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి, దాని వల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై ఈ కేబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: