హైదరాబాద్‌ ఆస్పత్రిలో కరోనాతో మహిళ మృతి.. వజ్రాల నగలు చోరీ...

మహిళకు ఉన్న వజ్రాల చెవికమ్మలు, ముక్కుపుడక లేవంటూ బాధితులు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.

news18-telugu
Updated: August 2, 2020, 4:50 PM IST
హైదరాబాద్‌ ఆస్పత్రిలో కరోనాతో మహిళ మృతి.. వజ్రాల నగలు చోరీ...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో దారుణం జరిగింది. కరోనాతో చనిపోయిన ఓ మహిళకు సంబంధించిన నగలు పోయాయంటూ మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళకు ఉన్న వజ్రాల చెవికమ్మలు, ముక్కుపుడక లేవంటూ బాధితులు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. కరోనా వైరస్ సోకిన ఓ మహిళ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరింది. ఒకరోజు తర్వాత ఆమె చనిపోయింది. అయితే, తమకు మృతదేహాన్ని అప్పగించే సమయంలో ఆమె ఒంటిపై ఉండాల్సిన నగలు మాయమయ్యాయంటూ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

తెలంగాణలో గత 24 గంటల్లో 1891 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 66677కి చేరింది. అలాగే... గత 24 గంటల్లో 10 మంది కరోనాతో చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 540కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో అసింప్టమేటిక్ కేసులు 84 శాతం ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. అంటే తెలంగాణలో కరోనా వస్తున్న ప్రతి 100 మందిలో... 84 మందిలో కరోనా లక్షణాలు కనిపించట్లేదన్నమాట. ఇండియాలో కరోనా మరణాల రేటు 2.15 శాతంగా ఉందన్న ప్రభుత్వం తెలంగాణలో అది 0.80 శాతంగా ఉందని తెలిపింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 2, 2020, 4:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading