కారు ఆపారని పోలీస్ చేయి కొరికి.. రక్తాన్ని డ్రెస్‌పై ఉమ్మిన యువతి..

కారును ఆపారని నడిరోడ్డుపై హల్‌చల్ చేసిందో యువతి. బయట ఎందుకు తిరుగుతున్నావంటూ ప్రశ్నించినందుకు గొడవ పెట్టుకోవడమే కాకుండా.. ఓ పోలీస్ చేతిని కొరికింది.

news18-telugu
Updated: March 26, 2020, 8:46 AM IST
కారు ఆపారని పోలీస్ చేయి కొరికి.. రక్తాన్ని డ్రెస్‌పై ఉమ్మిన యువతి..
ప్రతీకాత్మక చిత్రం (REUTERS/Rupak De Chowdhuri)
  • Share this:
దేశమంతా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో రోడ్డుపైకి వచ్చే వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. సరైన కారణం చెబితేనే విడిచిపెడుతున్నారు. లేకపోతే వాహనాలను సీజ్ చేసి.. కేసులు నమోదు చేస్తున్నారు. అలా.. తన కారును ఆపారని నడిరోడ్డుపై హల్‌చల్ చేసిందో యువతి. బయట ఎందుకు తిరుగుతున్నావంటూ ప్రశ్నించినందుకు గొడవ పెట్టుకోవడమే కాకుండా.. ఓ పోలీస్ చేతిని కొరికింది. అంతేకాదు.. రక్తాన్ని పోలీస్ డ్రెస్‌పై ఉమ్మింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో చోటుచేసుకుంది. నగరంలోని ఓ రోడ్డు మీద క్యాబ్ వస్తుండడంతో చూసి పోలీసులు ఆపేశారు. బయట ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించి.. డ్రైవర్‌ను దింపేవారు. ఇంతలో కారులో కూర్చున్న ఓ యువతి బయటకు వచ్చి పోలీసులతో గొడవకు దిగింది.

ఆమెతో పాటు ఉన్న యువకుడు కూడా పోలీసులతో గొడవకు దిగాడు. ఇంతలో విచక్షణ కోల్పోయిన ఆ యువతి.. అక్కడున్న పోలీస్ చేయి కొరికింది. నోట్లోకి రక్తం రావడంతో ఆ రక్తాన్ని మరో పోలీస్ డ్రెస్‌పై ఉమ్మింది. కాసేపు వారితో గొడవకు దిగింది. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయినా ఆమెను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.


First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు