కరోనాపై విజయం ముంగిట చిన్న దేశం... ఇంకొక్క కేసు..

కరోనాపై విజయం ముంగిట చిన్న దేశం... ఇంకొక్క కేసు..

ప్రతీకాత్మక చిత్రం

గత 13 రోజులుగా దేశంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఉన్న ఒక్క పేషెంట్ కూడా కరోనా నుంచి కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు.

  • Share this:
    కరోనా వైరస్‌పై విజయం ముంగిట నిలిచింది న్యూజిలాండ్. ప్రస్తుతం ఆ దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కటంటే ఒక్కటే ఉంది. ఆ ఒక్కరు కూడా కోలుకుంటే, కరోనా వైరస్‌పై న్యూజిలాండ్ జయకేతనం ఎగురవేస్తుంది. 50 లక్షల జనాభా ఉన్న న్యూజిలాండ్‌లో 1500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 13 రోజులుగా దేశంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఉన్న ఒక్క పేషెంట్ కూడా కరోనా నుంచి కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు. ఆ ఒక్కరు కూడా క్షేమంగా ఇంటికి వెళితే ఆ దేశం ఓ రకంగా సంబరాల్లో మునిగిపోతుంది. ఇప్పటికే న్యూజిలాండ్‌లో కరోనా వైరస్ లాక్ డౌన్ తరహా నియంత్రణ నుంచి కొన్ని సడలింపులు కూడా ఇచ్చారు. కానీ, మరికొన్ని రోజులు కొన్ని నిబంధనలను కొనసాగించనున్నారు. ఎక్కువ మంది గుమిగూడే వేడుకలు నిర్వహించవద్దని స్పష్టం చేశారు. వచ్చే వారం వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి. పూర్తిస్థాయిలో కరోనా నుంచి కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుంది కాబట్టి... ప్రజలు సాధారణ స్థితికి వచ్చేశామని అనుకోవద్దని, సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత లాంటివి తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు. విదేశాలతో బోర్డర్లను వచ్చే వారం వరకు కూడా మూసే ఉంచనున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: