తెలంగాణలో ఒక్కరోజే సెంచరీ దాటిన కరోనా కేసులు...

ఈ ఒక్కరోజే తెలంగాణలో 107 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

news18-telugu
Updated: May 27, 2020, 10:33 PM IST
తెలంగాణలో ఒక్కరోజే సెంచరీ దాటిన కరోనా కేసులు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ ఒక్కరోజే తెలంగాణలో 107 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. అందులో తెలంగాణకు సంబంధించి 39 కేసులు కాగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో 69 మందికి ఈ రోజు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వలస కూలీలు 19 మంది, సౌదీ అరేబియా నుంచి వచ్చిన 49 మందికి కరోనా వచ్చినట్టు నిర్ధారణ అయింది. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1842గా ఉంది. వలస కూలీలు, ఇతర రాష్ట్రాలు దేశాల నుంచి వచ్చిన వారికి కరోనా సోకిన వారి సంఖ్య 297గా ఉంది. ఇప్పటి వరకు తెలంగాణలో 1321 మంది డిశ్చార్జ్ అయ్యారు. 63 మంది ప్రాణాలు కోల్పోయారు. 714 మంది యాక్టివ్ కరోనా పేషెంట్లు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు కరోనాతో ఆరుగురు చనిపోయారు.

తెలంగాణలో కరోనా హెల్త్ బులెటిన్


కరోనా విషయంలో ప్రజలు భయోత్పాతానికి గురి కావాల్సిన పనిలేదని, లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఏమీ లేదని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఒక వేళ రాబోయే రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినప్పటికీ, తగిన వైద్య సేవలు అందించడానికి వైద్య,ఆరోగ్య శాఖ సంసిద్ధంగా ఉందని ప్రకటించారు. వైరస్ సోకిన వారిలో ఎవరికైనా ఆరోగ్యం బాగా క్షీణిస్తే అత్యవసర వైద్యం అందించాలని వైద్యాధికారులను కోరారు. కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు కెటి రామారావు, ఈటల రాజెందర్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస గౌడ్, పువ్వాడ అజయ్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, శాంత కుమారి, రామకృష్ణరావు, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కరుణాకర్ రెడ్డి, డిఎంఇ రమేశ్ రెడ్డి, డిపిహెచ్ శ్రీనివాస్, మెడికల్ హెల్త్ సలహాదారు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
First published: May 27, 2020, 10:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading