Home /News /coronavirus-latest-news /

WILL SERVE COVID PATIENTS AL QAEDA TERRORIST MOVES COURT SEEKING NOD TO WORK AS DOCTOR IN TIHAR JAIL SK GH

Tihar Doctor: డాక్టర్‌గా పనిచేస్తా.. అవకాశమివ్వండి.. కోర్టులో అల్‌ ఖైదా ఉగ్రవాది పిటిషన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అహ్మద్‌ గతంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్-ఖైదాలో పనిచేశాడు. అతడిని ఫిబ్రవరి 22న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. భారత్‌తో పాటు ఇతర దేశాల్లోని ఉగ్రవాద సంస్థలకు వివిధ రకాలుగా సాయం చేస్తున్నాడనే అభియోగాలతో అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు

ఇంకా చదవండి ...
డాక్టర్‌గా పనిచేసిన తన అనుభవాన్ని ఉపయోగించుకోవాలని కోర్టును ఆశ్రయించాడు ఒక మాజీ ఉగ్రవాది. కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యసేవలు అందించేందుకు తాను సిద్ధమని అతడు ప్రకటించాడు. ఇందుకు అనుమతి కోరుతూ ఢిల్లీ కోర్టును సైతం ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళ్తే.. గతంలో డాక్టర్‌గా పనిచేసిన సబీల్ అహ్మద్ అనే వ్యక్తి, ఆ తరువాత అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థతో కలిసి పనిచేశాడు. ప్రస్తుతం అతడు తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇక్కడి సెంట్రల్ జైలులో కోవిడ్ ఉద్ధృతి ఉన్న నేపథ్యంలో, రోగులకు వైద్య సేవలు అందించేందుకు అనుమతి ఇవ్వాలని అతడు స్పెషల్ జడ్జి ధర్మేందర్ రానాకు బుధవారం దరఖాస్తు చేసుకున్నాడు. వైద్య నిపుణుడిగా తనకు ఉన్న అనుభవం, నైపుణ్యాన్ని అధికారులు ఉపయోగించుకోవాలని సబీల్ కోరుతున్నాడు.

అహ్మద్‌ గతంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్-ఖైదాలో పనిచేశాడు. అతడిని ఫిబ్రవరి 22న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. భారత్‌తో పాటు ఇతర దేశాల్లోని ఉగ్రవాద సంస్థలకు వివిధ రకాలుగా సాయం చేస్తున్నాడనే అభియోగాలతో అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు తిహార్ జైలులో ఉన్నాడు. ఈ క్రమంలో వైద్య సేవలకు అనుమతించాలని అహ్మద్ తరఫు న్యాయవాది ఎం.ఎస్ ఖాన్ కోర్టుకు దరఖాస్తు పెట్టుకున్నాడు. నిందితుడికి వైద్య రంగంలో, క్లిష్టమైన కేసుల చికిత్సలో ఏడు సంవత్సరాల అనుభవం ఉందని లాయర్ కోర్టుకు తెలిపారు. MBBS చదివిన, అన్ని అర్హతలు ఉన్న అహ్మద్‌ను కోవిడ్ రోగులకు సేవలందించేందుకు అనుమతించాలని న్యాయమూర్తిని కోరారు. కోవిడ్-19 కేసుల పెరుగుదల నేపథ్యంలో ఈ సూచనను పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. తీహార్లోని సెంట్రల్ జైలులో కోవిడ్ సోకిన ఖైదీల చికిత్సకు అహ్మద్ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి జైలు సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేయమని సైతం కోరారు.

అహ్మద్ 2007 జూన్ 30న గ్లాస్గో విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడిలో నిందితుడిగా ఉన్నారు. అతన్ని గత ఏడాది ఆగస్టు 20న సౌదీ అరేబియా నుంచి బహిష్కరించారు. అనంతరం బెంగళూరులో నమోదైన మరో ఉగ్రవాద కేసులో అహ్మద్‌ను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఢిల్లీ పోలీసుల ప్రత్యేక సెల్ అతని కస్టడీకి తీసుకుంది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Corona cases, Coronavirus, Covid-19, New Delhi, Terrorists

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు