తెలంగాణలో స్కూళ్ల పున:ప్రారంభం అప్పుడే.. మంత్రి ఈటల రాజేందర్

ఈటల రాజేందర్

కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో 99శాతం మంది కోలుకుంటున్నారని.. చికిత్సలో ప్రొటోకాల్ పాటిస్తే మరణాలకు అవకాశం ఉండదని తెలిపారు ఈటల రాజేందర్.

  • Share this:
    తెలంగాణ జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. రాజధాని హైదరాబాద్‌లో తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా వైరస్‌కు ధైర్యమే అసలైన మందు అని అభిప్రాయపడ్డారు. అప్రమత్తంగా ఉన్న చోట కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని చెప్పారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో 99శాతం మంది కోలుకుంటున్నారని.. చికిత్సలో ప్రొటోకాల్ పాటిస్తే మరణాలకు అవకాశం ఉండదని తెలిపారు ఈటల రాజేందర్. ఎన్నివేళ మంది వచ్చినా కరోనా పరీక్షలు చేసేలా ఏర్పాట్లుచేశామని చెప్పారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిపట్ల వివక్ష చూపడం సరికాదని అన్నారు. కేంద్రప్రభుత్వం అనుమతిస్తే స్కూళ్లను రీ ఓపెనింగ్ చేస్తామని స్పష్టం చేశారు ఈటల.

    తెలంగాణలో కొత్తగా 2579 పాజిటివ్ కేసులు వచ్చాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 108670కి చేరింది. ఇక మరణాలు కొత్తగా 9 వచ్చాయి. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 770కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం రికవరీ రేటు 77.44 శాతంగా ఉంది. ఇండియాలో అది 75.27 శాతంగా ఉంది. నిన్న 1752 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 84163కి చేరాయి. అందువల్ల యాక్టివ్ కేసులు ఇప్పుడు 23737 మాత్రమే ఉన్నాయి. వీటిలో 17226 కేసుల్లో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. తెలంగాణలో నిన్న కొత్తగా 52933 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 1024054కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో సాధారణ బెడ్లు 11559 ఖాళీగా ఉన్నాయి. 725 నిండి ఉన్నాయి. ఆక్సిజన్ బెడ్లు 4821 ఖాళీగా ఉన్నాయి. 1040 నిండివున్నాయి. icu బెడ్లు 1636 ఖాళీగా ఉన్నాయి. 615 నిండివున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published: