Home /News /coronavirus-latest-news /

WILL OMICRON SPREAD IN NEW DELHI IS GROWING RAPIDLY HERE IS THE DETAILS AK

Covid 19: ఢిల్లీలో మళ్లీ కరోనా అలజడి.. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందా ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Omicron: ఢిల్లీలో నిన్న పెద్ద ఎత్తున కరోనా కేసులు వెలుగుచూశాయి. ఢిల్లీ ప్రభుత్వ హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య 923కి చేరుకుంది.

    ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. మన దేశంలోనూ వేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా జనాభా ఎక్కువగా ఉంటే ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లో ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉందనే విషయం అక్కడ కొత్తగా నమోదవుతున్న కేసులను బట్టి అర్థమవుతోంది. అయితే అక్కడ నమోదవుతున్న కేసులకు కారణంగా ఒమిక్రానేనా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక గత వారం రోజులుగా ఢిల్లీలోని పలు జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబొరేటరీలలో విశ్లేషించిన మొత్తం శాంపిల్స్‌లో 38 శాతం కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూస్తోంది. అధికారిక వర్గాల డేటా ప్రకారం.. అక్కడ డిసెంబర్ 21 నుండి 28 వరకు మొత్తం 468 నమూనాలను విశ్లేషించారు, వాటిలో 31 శాతం నమూనాలలో డెల్టా వేరియంట్, ఇతర వేరియంట్లు వెలుగు చూశాయి.

    ఈ నమూనాలను ఎన్‌సిడిసి, ఐఎల్‌బిఎస్, ఎల్‌ఎన్‌జెపి హాస్పిటల్‌లో విశ్లేషించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 14 ఓమిక్రాన్ కేసులలో ఏడు కేసులకు ఎలాంటి ప్రయాణ చరిత్ర లేదని ఆగ్నేయ జిల్లాలోని ఒక సీనియర్ అధికారి తెలిపారు. కొత్త రూపం కమ్యూనిటీ వ్యాప్తి చెందుతోందని ఆ అధికారి పేర్కొన్నారు. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించలేదు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సమాజంలో వ్యాప్తి చెందడం మొదలైందని ఒక సీనియర్ డాక్టర్ తెలిపారు. ఇది సోకిన వారికి ఎలాంటి లక్షణాలు లేవని.. కాబట్టి ఈ వేరియంట్ సోకినట్టు కూడా చాలామందికి తెలియదని ఆయన పేర్కొన్నారు.

    Omicron: ఒక్క రోజులో 4 ల‌క్ష‌ల క‌రోనా కేసులు.. ఒమిక్రాన్ వణికిపోతున్న అగ్ర‌రాజ్యం

    Omicron Contact Cases: ఏపీలో తొలిసారి సామాజిక వ్యాప్తి ద్వారా ఒమిక్రాన్.. ఆ జిల్లాల్లో కఠిన ఆంక్షలు

    ఇదిలా ఉంటే ఢిల్లీలో నిన్న పెద్ద ఎత్తున కరోనా కేసులు వెలుగుచూశాయి. ఢిల్లీ ప్రభుత్వ హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య 923కి చేరుకుంది. ఒక్క రోజులో కరోనా కేసుల సంఖ్య 86 శాతం పెరిగింది. నిన్న 344 కరోనా బాధితులు కోలుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. అదే సమయంలో ఢిల్లీలో కరోనా పాజిటివిటి రేటు 0.89 శాతం నుండి 1.29 శాతానికి పెరిగింది. కరోనా పాజిటివిటీ రేటు పెరుగుతుండటం.. రాబోయే రోజుల్లో ఆందోళనను పెంచబోతోంది. ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 71,696 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Covid -19 pandemic, Omicron corona variant

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు