Corona Vaccine: కరోనా వ్యాక్సిన్.. ఆ దేశ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

Covid-19 Vaccine:కరోనాను ఎదుర్కొనే అంశంలో తొలి నుంచి వ్యాక్సిన్లను వ్యతిరేకిస్తూ వస్తున్న బోల్సొనారో.. వ్యాక్సిన్‌ను తీసుకోనంటూ మరోసారి ప్రకటించారు.

news18-telugu
Updated: November 27, 2020, 11:51 AM IST
Corona Vaccine: కరోనా వ్యాక్సిన్.. ఆ దేశ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వ్యాక్సిన్‌ మరో ఒకటి రెండు నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. భారత్ సహా అనేక దేశాలు వ్యాక్సిన్ తయారీలో చివరి దశలో ఉన్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే.. దాన్ని ప్రజలకు అందించేందుకు భారత్ వంటి దేశాల్లో ముందస్తు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న కరోనా వ్యాక్సిన్ విషయంలో బ్రెజిల్ దేశ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌ కట్టడికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ తాను తీసుకోబోనని బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సనారో స్పష్టం చేశారు. కరోనాను ఎదుర్కొనే అంశంలో తొలి నుంచి వ్యాక్సిన్లను వ్యతిరేకిస్తూ వస్తున్న బోల్సొనారో.. వ్యాక్సిన్‌ను తీసుకోనంటూ మరోసారి ప్రకటించారు. అంతేకాదు.. వ్యాక్సిన్ తీసుకోకపోవడం తన హక్కు అంటూ వ్యాఖ్యానించారు. బ్రెజిల్‌ దేశ ప్రజలకు సైతం వ్యాక్సిన్ల అవసరంలేదంటూ బోల్సొనారో కామెంట్ చేశారు.

కరోనా మరణాలు, వ్యాక్సిన్ల విషయంలో మొదటి నుంచి బ్రెజిల్‌ ప్రెసిడెంట్‌ బోల్సొనారో భిన్నమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. వ్యాక్సినేషన్ల ప్రోగ్రామ్‌లపై బోల్సొనారో పలుమార్లు అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. అంతటితో ఆగిన బోల్సోనారో.. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంలో మాస్క్‌లు అంత ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు స్పష్టంకాలేదని అభిప్రాయపడ్డారు. వైరస్‌ను మాస్క్‌లు అడ్డుకుంటున్నట్లు స్వల్ప ఆధారాలు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌ తన పెంపుడు కుక్కకు మాత్రమే అవసరమున్నట్లు అక్టోబర్‌లో ట్విటర్‌ ద్వారా బోల్సొనారో జోక్‌ చేశారు.

బోల్సోనారో వ్యాఖ్యలు ఎలా ఉన్నా.. బ్రెజిల్‌లో మాత్రం కరోనా తీవ్రంగానే ఉంది. అమెరికా, ఇండియా తరువాత కరోనా కేసులు ఎక్కువగా నమోదైంది బ్రెజిల్‌లోనే. బ్రెజిల్‌లో ఇప్పటివరకు 6,204,570 కేసులు నమోదయ్యాయి. మొత్తం 171,497 మంది కరోనా కారణంగా చనిపోయారు. ప్రస్తుతం బ్రెజిల్‌లో 504,474 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Published by: Kishore Akkaladevi
First published: November 27, 2020, 11:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading