Home /News /coronavirus-latest-news /

Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుందా?.. ప్రతి ఏడాది డోసులు తీసుకోవడం తప్పనిసరా?

Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుందా?.. ప్రతి ఏడాది డోసులు తీసుకోవడం తప్పనిసరా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్ కొనసాగుతుంది. అయితే కరోనా వ్యాక్సిన్ పూర్తి సురక్షితమా..? ప్రతి ఏడాది కరోనా టీకా తీసుకోవాల్సి ఉంటుందా అనే ప్రశ్నలు ఇప్పుడు తెగ చర్చనీయాంశంగా మారాయి.

కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. దేశంలో లక్షల మంది మొదటి డోసు టీకాను అందించారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన కోవిడ్ నుంచి పూర్తిగా రక్షణ పొందినట్లు కాదు. ఈ టీకా కేవలం నిర్దిష్ట సమయం వరకు తీవ్రమైన లక్షణాలను అభివృద్ధి చేయకుండా కాపాడుతుందంతే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఏవీ 100 శాతం ప్రభావవంతంగా లేవు. కాబట్టి నిర్ణీత వ్యవధి తర్వాత మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మరో డోసు తీసుకోవాల్సిన అవసరముంది. మెడికల్ సైన్స్ నిపుణుల అభిప్రాయం ప్రకారం నూతన టీకా వచ్చే వరకు ప్రస్తుతం ఉన్న డోసులను క్రమం తప్పకుండా తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

టీకా ఎందుకు అంత ప్రభావవంతంగా ఉండట్లేదు..
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి పెను సవాళ్లను విసురుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకా ప్రభావం కూడా అదే మాదిరిగా ఉంది. వ్యాక్సిన్ ప్రభావం, సమర్థత ఒకేలా ఉండకపోవచ్చు. అధిక సమర్థత రేటున్న టీకా ఎప్పుడూ ఎక్కువ ప్రభావం చూపుతుందనడంలో అర్థం లేదు. కరోనా స్ట్రెయిన్ నిరంతరం పరివర్తనం చెందుతన్న కారణంగా వ్యాక్సిన్ అంత ప్రభావవంతంగా ఉండకపోవచ్చు.

తరచూ ఫైజర్ టీకా తీసుకోవాలి..
ఫైజర్ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా ఈ విషయంపై స్పందించారు. ప్రస్తుతం లభిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ మీకు ఎల్లవేళలా రక్షణ ఇస్తుందని చెప్పలేమని ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. "ప్రతి సంవత్సరం ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులు క్షేమంగా ఉంటారు. ఫైజర్ వ్యాక్సిన్ 95 శాతం క్లినికల్ ట్రయల్ ను పూర్తి చేసుకుని నిరూపితమైంది. కానీ వాస్తవంలోకి వచ్చేసరికి పరిస్థితులు మారిపోతాయి. ఫైజర్ టీకా మరింత ప్రభావవంతంగా పనిచేసేందుకు ప్రస్తుతం మూడో డోసు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాం. వైరస్ మారుతున్న స్వభావాన్ని ఎదుర్కొవడానికి ఫ్లూ షాట్ మాదిరిగా ప్రతి ఏడాది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలి" అని ఆయన అన్నారు.

మోడెర్నా వ్యాక్సిన్ కూడా అంతే..
మోడెర్నా వ్యాక్సిన్ విషయంలో కూడా వైరస్ ప్రభావాలను తగ్గించడానికి రెగ్యులర్ గా షాట్ తీసుకోవాల్సి ఉంటుంది. మోడెర్నా సీఈఓ స్టెఫ్న్ బాన్సెల్ ఈ విషయాన్ని జనవరిలోనే స్పష్టం చేశారు. వైరస్ తో కలిసి జీవిచండమంటే ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదని తెలిపారు. మహమ్మారి ప్రభావం పేద వర్గాల ప్రజలపై ఎక్కువగా ఉంటుందని, వారిలో అనారోగ్య లక్షణాలు తీవ్రంగా ఉంటాయని తెలిపారు. ఇతర వ్యాక్సిన్ మాదిరిగానే దీన్ని కూడా ప్రతి ఏడాది లేదా రెండేళ్లకోసారి తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు.

భారత వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తున్నాయి..
మనదేశంలో రెండు వ్యాక్సిన్లు అందేజేస్తున్నారు. అవే కోవిషీల్డ్, కోవాగ్జిన్. అస్ట్రాజెనికా కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు 81.3 శాతం క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. కోవాగ్జిన్ 81 శాతం నిర్వహించారు. అయితే రెండు వ్యాక్సిన్లు భారత్ లో వైరస్ ను నిరోధించేందుకు ఉపయోగిస్తున్నారు. ఇటీవలే మూడో దశ టీకా కార్యక్రమం ప్రారంభించింది భారత ప్రభుత్వం. దీని ప్రకారం 45 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరూ టీకా వేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఎంతకాలం ఈ వ్యాక్సిన్లు వైరస్ నుంచి రక్షణ కల్పిస్తాయో అనే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి ధ్రువీకరణ లేదు. నిపుణులు మాత్రం ఈ రెండు వ్యాక్సిన్ వ్యక్తులకు జీవిత కాలం పాటు రోగనిరోధక శక్తిని అందజేస్తాయని అంటున్నారు.

అధ్యయనం ఏం చెబుతుంది..
పీపుల్స్ వ్యాక్సిన్ అలయన్స్ అధ్యయనం ప్రకారం ప్రస్తుతమున్న టీకాల్లో ఏడాదిలోపు మార్పులు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. మూడింట రెండొంతుల శాస్త్రవేత్తలు ఈ సర్వే నిర్వహించి ఈ విషయాన్ని తెలిపారు. ఈ స్టడీలో అమ్నేస్టీ ఇంటర్నేషనల్, UNAIDS, ఆక్ఫామ్ లాంటి అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయి. 28 దేశాల నుంచి 77 ఎపిడెమిమాలజిస్టు, వైరాలజిస్టు, ఇన్ఫెక్షియస్ స్పెషలిస్టులు సర్వేలో పాల్గొన్నారు. మూడింట రెండొంతుల మంది టీకాను ఏడాది లోపు అప్ గ్రేడ్ చేయాల్సి ఆవశ్యకతను వివరించగా..మూడో వంతు మంది 9 నెలల నుంచే దీన్ని చేయాల్సి అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ పరిశోధకుల ప్రకారం కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ నెమ్మదిగా పనిచేయవచ్చని అన్నారు. ప్రస్తుత డోసులు కంట్రోల్ చేయలేవని స్పష్టం చేశారు.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Coronavirus, COVID-19 vaccine, Health

తదుపరి వార్తలు