హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Vaccine for Omicron: కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్.. ఒమిక్రాన్‌ వేరియంట్‌కు ప్రత్యేకంగా వ్యాక్సిన్ అవసరమా?

Vaccine for Omicron: కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్.. ఒమిక్రాన్‌ వేరియంట్‌కు ప్రత్యేకంగా వ్యాక్సిన్ అవసరమా?

8.కంపెనీ నిర్వాహకులు సూపర్‌వైజర్లు, మేనేజర్‌లను నియమించడం ద్వారా మరియు CCTV ఫుటేజీ ద్వారా ఫేస్ మాస్క్‌లు ధరించడాన్ని పర్యవేక్షించాల‌ని తెలిపింది. మాస్క్‌లు ధరించని సిబ్బందిని పని స్థలం నుంచి బయటకు పంపాల‌ని తెలిపింది. డిపిహెచ్ ఇంకా 50 శాతం భోజన స్థలాలను మాత్రమే వినియోగించుకోవాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది.   (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

8.కంపెనీ నిర్వాహకులు సూపర్‌వైజర్లు, మేనేజర్‌లను నియమించడం ద్వారా మరియు CCTV ఫుటేజీ ద్వారా ఫేస్ మాస్క్‌లు ధరించడాన్ని పర్యవేక్షించాల‌ని తెలిపింది. మాస్క్‌లు ధరించని సిబ్బందిని పని స్థలం నుంచి బయటకు పంపాల‌ని తెలిపింది. డిపిహెచ్ ఇంకా 50 శాతం భోజన స్థలాలను మాత్రమే వినియోగించుకోవాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

కొత్త వేరియంట్ (Corona New Variant) పై తమ టీకాలు (Covid Vaccine) పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి చాలా కంపెనీలు ఇప్పటికే పరిశోధనలు ప్రారంభించాయి. అయితే ఇందుకు అనేక వారాల సమయం పడుతుందని స్పష్టం చేశాయి. అయితే..

కరోనా (Corona) మహమ్మారి దాదాపు రెండు సంవత్సరాలుగా యావత్ ప్రపంచానికి వణుకు పుట్టిస్తోంది. తగ్గుతుందిలే అనుకునేలోపే కొత్త వేరియంట్లుగా (Corona New Variant) మారి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు డెల్టా వేరియంట్ (Delta Variant) తో ప్రపంచ దేశాలు భయభ్రాంతులకు గురవ్వగా.. తాజాగా మరో రకం వైరస్ కలవరపెడుతోంది. అదే ఒమిక్రాన్ వేరియంట్ (Omicron corona variant). వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఈ నూతన స్ట్రెయిన్ ఎంతమేరకు ప్రభావితం చూపిస్తుందో తెలియట్లేదు. ఒమిక్రాన్ వేరియంట్ నుంచి టీకాలు రక్షిస్తాయా అనేదానిపై కూడా స్పష్టత లేదు. అంతేకాకుండా ఈ వేరియంట్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళనకరమైన వేరియంట్‌గా గుర్తించింది. ఇది కేవలం రెండు వారాల్లోనే వ్యాపిస్తుందని, మొదటి కేసు దక్షిణాఫ్రికాలో నమోదైందని స్పష్టం చేసింది. అక్కడ ఈ వేరియంట్ చాలా వేగవంతంగా వ్యాప్తి చెందిందని వెల్లడించింది.

ప్రయాణాలపై ఆంక్షలు..

దక్షిణాఫ్రికాలోని పరిశోధకుల ప్రకారం, మిగిలిన వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ రోగనిరోధక శక్తిని ఎదుర్కోవడంలో అధిక సామర్థ్యాన్ని ప్రదర్శించిందని పేర్కొన్నారు. ఈ కారణంగా అమెరికా సహా ఏడు దేశాలు దక్షిణాఫ్రికాకు రాకపోకలు నిలిపివేస్తున్నామని ప్రకటించాయి. అయితే వ్యాక్సిన్ తీసుకున్నవారిపై కూడా ఒమిక్రాన్ మరణ ప్రమాదాన్ని కలిగిస్తుందా అనే విషయంపై స్పష్టత లేదు. ఇది తెలియాలంటే మరింత డేటా అవసరం. ప్రపంచ ఆరోగ్య సంస్థకు నూతన వేరియంట్ గురించి నివేదించిన మొదట దేశం దక్షిణాఫ్రికానేనని అని సదరు దేశంలో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ కమ్యూనికేషన్ డిసీజెస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ జినాల్ భీమాన్ చెప్పారు. సీరియస్ ఇన్ఫెక్షన్లపై ప్రస్తుతమున్న టీకాలు రక్షణ కల్పించకపోతే టీకా తయారీదారులు తమ ఉత్పత్తులను సర్దుబాటు చేయడానికి పురికొల్పవచ్చని జినాల్ అన్నారు. కేసుల పెరుగుదల అనేది కొత్త ఉత్పత్తితో ముందుకు రావడానికి సంకేతమని తెలిపారు.

Omicron: ఒమిక్రాన్ టెన్షన్.. ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ అత్యవసర భేటీ.. ఏం చేయబోతున్నారు?

వ్యాక్సిన్ సంస్థలు ఏం చేస్తున్నాయి?

ఇదిలా ఉంటే కొత్త వేరియంట్ పై తమ టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి చాలా కంపెనీలు ఇప్పటికే పరిశోధనలు ప్రారంభించాయి. అయితే ఇందుకు అనేక వారాల సమయం పడుతుందని స్పష్టం చేశాయి. ఇప్పటికే ఉన్న బూస్టర్లను ఒమిక్రాన్ వేరియంట్ కు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చో లేదో తెలుసుకోవడానికి పరీక్షిస్తున్నామని మోడెర్నా సంస్థ తెలిపింది. ఫైజర్ టీకాను అభివృద్ధి చేసిన ఫైజర్, బయో ఎంటెక్ సంస్థలు కూడా ఈ విషయంపై స్పందించాయి. తమ టీకా నూతన వేరియంట్ ను ఎదుర్కోలేకపోతే 100 రోజుల్లో "టైలర్ మేడ్ వ్యాక్సిన్" ను అభివృద్ధి చేస్తామని ప్రకటించాయి.

Omicron: ఒమిక్రాన్ వేరియెంట్.. అత్యంత ఘోరమైన వైరస్.. 2 డోసుల టీకా వేసుకున్నా వదలదా?

పరిశోధకులు ఏమంటున్నారు?

డెల్టా వేరియంట్ సహా ఇంతకుముందు వచ్చిన వేరియంట్ల విషయంలో ఫైజర్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేసింది. ముఖ్యంగా అమెరికాలో ఎక్కువగా ప్రబలిన డెల్టా వేరియంట్ వల్ల వచ్చిన తీవ్రమైన ఇన్ఫెక్షన్లను రక్షించడంలో ఇప్పటికే ఉన్న టీకాలు ప్రభావవంతంగా పనిచేశాయి. ఇది ఒమిక్రాన్ విషయంలో కూడా పనిచేయవచ్చని కొంతమంది పరిశోధకులు అంటున్నారు. టీకాలను అఫ్డేట్ చేయాల్సిన అవసరం లేదని పెన్ స్టేట్ వర్సిటీకి చెందిన డేవిడ్ కెన్నడీ అన్నారు. దక్షిణాఫ్రికా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పరిమిత డేటా ఆధారంగా ఆందోళన పెరిగాయని, భయపడాల్సినంత పనిలేదని తెలిపారు.

New Covid Variant: ఎయిడ్స్ రోగి నుంచి కరోనా కొత్త వేరియెంట్.. మరో ముప్పు పొంచి ఉందా?

అయితే పరిస్థితులకు తగినట్లు అప్డేట్ అవ్వడం తెలివైన పనే అని క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ కు చెందిన దీప్తి గురుదాసాని అన్నారు. వైరస్ వ్యాప్తిని ప్రపంచం నియంత్రించగలిగితే ఆ ప్రయత్నాలు ప్రభావంతంగా ఉంటాయని తెలిపారు. మూడు లేదా నాలుగు నెలల వ్యవధిలో ఫైజర్ తన నూతన వ్యాక్సిన్ తో వచ్చే అవకాశముందని, ఆ సమయానికి నూతన వేరియంట్ కూడా వ్యాపిస్తుందని స్పష్టం చేశారు. కాబట్టి వ్యాక్సిన్ డెవలప్మెంట్, రీ-ఇంజినీరింగ్ ట్రాన్స్ మిషన్ లాంటి ప్రయత్నాలు చేయాలని అన్నారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Corona, Corona Vaccine, COVID-19 vaccine, Delta Variant, Omicron corona variant, Vaccinated for Covid 19

ఉత్తమ కథలు