హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Corona Vaccine: వ్యాక్సీన్ తీసుకుంటే నపుంసకత్వం వస్తుందా.. DCGI ఏమందంటే..

Corona Vaccine: వ్యాక్సీన్ తీసుకుంటే నపుంసకత్వం వస్తుందా.. DCGI ఏమందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వ్యాక్సీన్ వచ్చిన తరుణంలో ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాదు కొందరు రాజకీయ నేతలు కూడా గందరగోళం సృష్టించారు. కరోనా వ్యాక్సీన్ సురక్షితమైనది కాదని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సీన్‌ల భద్రతపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) స్పష్టతనిచ్చారు.

ఇంకా చదవండి ...

  మనదేశంలో కరోనా వ్యాక్సీన్ వచ్చేసింది. అత్యవసర సమయంలో కోవిషీల్డ్ (covishield), కోవాగ్జిన్ (Covaxin) వ్యాక్సీన్‌‌ల వినియోగానికి షరతులతో అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. వ్యాక్సీన్ వచ్చిన తరుణంలో ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాదు కొందరు రాజకీయ నేతలు కూడా గందరగోళం సృష్టించారు. కరోనా వ్యాక్సీన్ సురక్షితమైనది కాదని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సీన్‌ల భద్రతపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) స్పష్టతనిచ్చారు. భద్రతాపరమైన అంశాలను పరిగణాలోకి తీసుకోకుండా తాము దేనినీ ఆమోదించబోమని వీజీ సోమని తెలిపారు. వ్యాక్సీన్‌లు సురక్షితమైనవేనని ఆయన స్పష్టం చేశారు.

  ''భద్రతాపరమైన అంశాలను పరిగణలోకి తీసుకోకుండా మేం దేనినీ ఆమోదించం. వాక్సీన్లు 110 శాతం సురక్షితనమైనవి. ఏ వ్యాక్సీన్ తీసుకున్నా జ్వరం, నొప్పి, అలర్జీ వంటి సైడ్ ఎఫెక్ట్స్ సర్వ సాధారణంగా కనిపిస్తాయి. వ్యాక్సీన్ తీసుకుంటే పురుషుల్లో నపుంసకత్వం వస్తుందన్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు.'' అని డీసీజీఐ వీ.జీ.సోమని పేర్కొన్నారు.

  కరోనా వ్యాక్సీన్‌‌పై సమాజ్‌వాదీ పార్టీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వ్యాక్సీన్‌పై తమకు నమ్మకం లేదని.. ఆ వ్యాక్సీన్‌ను తాను వేసుకోబోనని ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక నాణ్యమైన, సురక్షితమైన టీకాలను ప్రజలకు ఉచితంగానే వేస్తామని చెప్పారు. అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికీ.. ఆ పార్టీ ఎమ్మెల్సీ అశుతోష్ సిన్హా మరో బాంబు పేల్చారు. కరోనా వ్యాక్సీన్ పురుషుల్ని నపుంసకుల్ని చేస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

  '' కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ (యూపీలో) అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాక్సిన్‌ను మేం నమ్మం. మా నాయకుడు అఖిలేష్ యాదవ్ కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం లేదంటే, దాని వెనుక కచ్చితంగా ఓ కారణం ఉంటుంది. దాని వెనుక కొన్ని నిజాలు ఉంటాయి. దాని వల్ల ప్రజలకు హాని కలగవచ్చు.అది మిమ్మల్ని నపుంసకులిగా చేస్తుంది. అఖిలేష్ యాదవ్ చెప్పారంటే అది కేవలం సమాజ్ వాదీ పార్టీ నేతలకు మాత్రమే కాదు. మొత్తం రాష్ట్రానికి కూడా. రాష్ట్రంలో ప్రజలు అందరూ కరోనా వ్యాక్సిన్‌కి దూరంగా ఉండండి.’' అని అశుతోష్ సిన్హా చెప్పారు.

  సమాజ్‌వాదీ పార్టీ నేతలు ఈ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. వ్యాక్సీన్ విషయంలోనూ రాజకీయాలు చేయడమేంటని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ తీసుకొస్తున్న తరుణంలో అఖిలేష్ యాదవ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యంగా ఉందన్నారు. ఇక ఇప్పటికే దేశంలో అందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. కొవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలకు డీజీసీఐ ఆమోద ముద్ర వేయడంతో త్వరలోనే టీకాల పంపిణీని ప్రారంభించనున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Corona Vaccine, Coronavirus, Covaxin, COVID-19 vaccine

  ఉత్తమ కథలు