భార్య శాంపిల్స్‌ను పనిమనిషి పేరుమీద పంపిన డాక్టర్... ఆ తర్వాత ఏమైందంటే...

కరోనాను దాయడం చాలా ప్రమాదకరం... అలాంటిది ఆ డాక్టర్ ఎందుకు అలా చేశారు. భార్య శాంపిల్స్‌ని టెస్టింగ్ కోసం పంపి... పనిమనిషివి అని ఎందుకు చెప్పాడు?

news18-telugu
Updated: July 12, 2020, 9:15 AM IST
భార్య శాంపిల్స్‌ను పనిమనిషి పేరుమీద పంపిన డాక్టర్... ఆ తర్వాత ఏమైందంటే...
భార్య శాంపిల్స్‌ను పనిమనిషి పేరుమీద పంపిన డాక్టర్... (File)
  • Share this:
అది మధ్యప్రదేశ్‌... సింగ్రౌలీ ప్రాంతం. ఆయనో ప్రభుత్వ డాక్టర్. ఉత్తరప్రదేశ్‌లో... ఓ పెళ్లి వేడుకకు కుటుంబంతో వెళ్లాడు. అందుకు సెలవులు ఇవ్వకపోయినా... తీసుకున్నాడు. ఆ పెళ్లి నుంచి వచ్చాక... భార్యకు దగ్గు రావడం మొదలైంది. ఆ డాక్టర్‌కి డౌట్ వచ్చింది. ఆమె శాంపిల్స్ సేకరించి... ఇంట్లో పని మనిషి పేరు మీద వాటిని టెస్టింగ్ కోసం పంపాడు. ఇలా ఎందుకు చేశాడంటే... తాను చెప్పా పెట్టకుండా... పెళ్లికి వెళ్లిన విషయం... తన పై డాక్టర్లకు తెలియకూడదనే. కానీ... డాక్టర్ చేసిన నిర్వాకం బయటపడింది. పై అధికారుల అనుమతి తీసుకోకుండా... బయటి కార్యక్రమానికి వెళ్లడమే కాకుండా... భార్య శాంపిల్స్‌ని పనిమనిషి పేరుమీద టెస్ట్ చేయించినందుకు ఆ డాక్టర్‌పై కేసు నమోదైంది.

సింగ్రౌలీలోని ఖుటార్ హెల్త్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు డాక్టర్ అభయ్ రంజన్ సింగ్. జూన్ 23న కుటుంబంతో కలిసి... ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో జరుగుతున్న పెళ్లికి వెళ్లాడు. జులై 1న తిరిగి మధ్యప్రదేశ్ వచ్చాడు. వచ్చాక... తన ఫ్యామిలీతో క్వారంటైన్ అవ్వకుండా... విధులు నిర్వహించడం మొదలుపెట్టాడు.

శాంపిల్ టెస్టుల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. డాక్టర్ పనిమనిషిని తీసుకెళ్దామని వైద్య సిబ్బంది ఆయన ఇంటికి వచ్చారు. అప్పుడు అర్థమైంది. కరోనా ఉన్నది పని మనిషికి కాదనీ... డాక్టర్ భార్యకి అని. ఆమెను తీసుకెళ్లారు. ఆ తర్వాత డాక్టర్‌కీ, మరో ఇద్దరు కుటుంబ సభయులకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.

చాలా మంది కరోనాను దాచివేయాలనుకుంటున్నారు. అది ప్రమాదకరం, నేరం కూడా. కరోనాను దాస్తే... ఆ వ్యక్తుల ద్వారా అది ఇతరులకు పాకే ప్రమాదం ఉంటుంది. అందుకే... కరోనా సోకితే... ఆ విషయాన్ని ధైర్యంగా ఒప్పుకోవాలి. ఇతరులకు సోకకుండా జాగ్రత్త పడాలి. ఈ ఘటనలో డాక్టర్ నిర్వాకం వల్ల... ఆయన పనిచేస్తున్న హెల్త్ సెంటర్‌లో 33 మంది ప్రభుత్వ సిబ్బందిని ఐసోలేట్ చేశారు. వాళ్లందరి శాంపిల్స్ సేకరించి... టెస్టింగ్ కోసం పంపారు.
Published by: Krishna Kumar N
First published: July 12, 2020, 9:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading