లాక్‌డౌన్ కొనసాగింపులో ప్రధాని మోదీ ముందుచూపు.. మే 3 వరకే ఎందుకంటే..

ప్రతీకాత్మక చిత్రం

Lockdown Extension : రాష్ట్రాలన్నీ ఏప్రిల్ 30 వరకు మాత్రమే లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించాయి. కానీ, మోదీ మాత్రం మే 3 వరకు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

 • Share this:
  Lockdown Extension : అనుకున్నట్లు లాక్‌డౌన్ కొనసాగింపునకే ప్రధాని మోదీ మొగ్గు చూపారు. ప్రధాని మోదీ నిర్ణయం తీసుకునే కంటే ముందే పలు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రాలన్నీ ఏప్రిల్ 30 వరకు మాత్రమే లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించాయి. కానీ, మోదీ మాత్రం మే 3 వరకు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏదైనా డెడ్‌లైన్ ఉంటే నెల చివరో, లేక.. సగం రోజులో ఉండాలి కదా. మరి మే 3 వరకు ఎందుకు కొనసాగించారు? అంటే.. ఆయన ముందు చూపుతోనే వ్యవహరించారు అని చెప్పాలి. వాస్తవానికి ఏప్రిల్ 30న గురువారం వస్తోంది. ఆ తర్వాత మే1 న కార్మికుల దినోత్సవం. ఆ రోజు హాలీడే. తర్వాత మే 2న శనివారం, మే 3న ఆదివారం ఈ రెండు రోజులు వారాంతపు సెలవులే. కాబట్టి వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మే 3 వరకు లాక్‌డౌన్‌ను కొనసాగించారు.

  కాగా, ఆ మూడు రోజులు సెలవులు వచ్చాయని, ప్రజలు మూకుమ్మడిగా రోడ్ల మీదకు వస్తే మళ్లీ కరోనా విజృంభించే అవకాశాలు లేకపోలేదు. అదేదో.. ఆ మూడు రోజులను కూడా లాక్‌డౌన్‌లోకి తీసుకొస్తే పరిస్థితిని కాస్త అదుపు చేయవచ్చని మోదీ సర్కారు భావించినట్లు కనిపిస్తోంది.

  మే 1 - కార్మికుల దినోత్సవం (సెలవు)
  మే 2 - శనివారం (వారాంతం)
  మే 3 - ఆదివారం (వారాంతం)
  Published by:Shravan Kumar Bommakanti
  First published: