కరోనాపై ఎందుకింత నిర్లక్ష్యం.. తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రుల లైసెన్స్ రద్దు చేశామని తెలంగాణ ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. అయితే మిగిలిన ఆస్పత్రుల పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది.

news18-telugu
Updated: August 13, 2020, 12:45 PM IST
కరోనాపై ఎందుకింత నిర్లక్ష్యం.. తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనాపై ఎందుకు ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం ఎందుకని తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము గతంలో ఇచ్చిన ఆదేశాలు ఏ ఒక్కటి అమలు కాలేదని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం తరపున విచారణకు హాజరైన తెలంగాణ చీఫ్ సెక్రటరీపై హైకోర్టు సీరియస్ అయ్యింది. కరోనా చికిత్స అంశంలో ప్రైవేటు ఆస్పత్రులు ప్రజలను పీడిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని న్యాయస్థానం ప్రశ్నించింది. అయితే ఇప్పటివకు 50 మందికి నోటిసులు ఇచ్చామని ప్రభుత్వం కోర్టుకు వివరించింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రుల లైసెన్స్ రద్దు చేశామని న్యాయస్థానానికి తెలిపింది. అయితే మిగిలిన ఆస్పత్రుల పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వం తాము ఇచ్చిన ఆదేశాలను పాటించడం లేదని గతంలో వ్యాఖ్యానించిన హైకోర్టు.. గతంలో ఇచ్చిన సూచనలు ప్రభుత్వం ఏ మేరకు పాటిస్తుందనే అంశంపై విచారణ చేపట్టింది. ఇందుకు సంబంధించి వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తరపున సీఎస్ సోమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కేసు విచారణకు హాజరయ్యారు.
Published by: Kishore Akkaladevi
First published: August 13, 2020, 12:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading