గడిచిన 20 ఏళ్లలో చైనా ప్రపంచానికి పరిచయం చేసిన 4 ప్రాణాంతక వైరస్‌లు ఇవే...

అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రెయిన్ గత 20 ఏళ్లలో చైనా ప్రపంచానికి 5 పెద్ద సంక్షోభాలను ఇచ్చిందని పేర్కొన్నారు. వాటిలో 4 వైరస్లు ఉన్నాయని అవి SARS, ఏవియన్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ కరోనా వైరస్ చైనా నుండి ప్రపంచానికి వ్యాపించాయని ఆయన పేర్కొన్నారు.

news18-telugu
Updated: May 15, 2020, 8:26 AM IST
గడిచిన 20 ఏళ్లలో చైనా ప్రపంచానికి పరిచయం చేసిన 4 ప్రాణాంతక వైరస్‌లు ఇవే...
(credit - NIAID)
  • Share this:
కరోనా వైరస్ పుట్టుక గురించి అమెరికా మరియు చైనా మధ్య యుద్ధం ఇప్పుడు మరింత తీవ్రంగా మారింది. ఇప్పుడు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రెయిన్ గత 20 ఏళ్లలో చైనా ప్రపంచానికి 5 పెద్ద సంక్షోభాలను ఇచ్చిందని పేర్కొన్నారు. వాటిలో 4 వైరస్లు ఉన్నాయని అవి SARS, ఏవియన్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ కరోనా వైరస్ చైనా నుండి ప్రపంచానికి వ్యాపించాయని ఆయన పేర్కొన్నారు. చైనాలోని వుహాన్ నగరం నుండి కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందని కొన్ని ఆధారాలు ఉన్నాయని మాకు తెలుసు. వాస్తవానికి స్వైన్ ఫ్లూ మినహా యుఎస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ లేవనెత్తిన అంశాల్లో చాలా నిజం ఉంది. స్వైన్ ఫ్లూ చైనా నుంచి పుట్టలేదు, కానీ గత కొన్ని సంవత్సరాల్లో, చైనాలోని సముద్ర జీవులను విక్రయించే మార్కెట్‌పై చాలా సార్లు అంతర్జాతీయ సంస్థలు వేలెత్తి చూపాయి. SARS,ఏవియన్ ఫ్లూ ఇప్పుడు కరోనా వైరస్ మొత్తం ప్రపంచాన్ని ప్రమాదంలో పడేసింది. చైనా లోని ఆహార అలవాట్ల గురించి కూడా ప్రశ్నలు తలెత్తాయి, ఇందులో వన్యప్రాణులు...అరుదైన జీవ జాతులను చంపడం వాటిని తినడం వంటివి ఉన్నాయి. అయితే, కరోనా వైరస్‌కు సంబంధించిన వుహాన్ ల్యాబ్ లో పుట్టింది అనడానికి పూర్తి ఆధారాలు లేవని ప్రపంచవ్యాప్తంగా గబ్బిలాలపై పరిశోధన చేసిన అమెరికన్ శాస్త్రవేత్త పీటర్ దాస్జాక్ ఈ విషయం తెలిపారు.

SARS

SARS మహమ్మారి నవంబర్ 2002 లో చైనా నుండి వ్యాపించింది. ఈ వైరస్ మొట్టమొదట దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రాంతంలో కనుగొన్నారు. నవంబర్ 2002 మరియు జూలై 2003 మధ్య, దక్షిణ చైనాలో SARS వ్యాధి వ్యాప్తి చెందింది. అనేక దేశాల్లో ఈ అంటువ్యాధి కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధిక మరణాలు హాంకాంగ్‌లో సంభవించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం, ఈ అంటువ్యాధిలో మరణాల రేటు 9.6 శాతం. ఈ వ్యాధి ప్రపంచంలోని 37 దేశాలకు వ్యాపించింది. కరోనా వైరస్ కూడా SARS కుటుంబానికి చెందినదే. అయితే నేటికీ, SARS వైరస్‌కు టీకా లేదు. SARS వ్యాపించిన సమయంలోనే, చైనాలోని సముద్ర జీవుల మార్కెట్ గురించి చాలా విషయాలు ప్రపంచానికి తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా మాంసం వ్యాపారం పెరుగుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవులు తగ్గిపోవడంతో పాటు. ఆహారం కోసం జంతువుల పెంపకం పెరుగుతోంది. ఈ కారణంగా, అటవీ జంతువుల వైరస్‌లు, వ్యవసాయ జంతువులలోకి వస్తాయి. అక్కడ నుండి, ఈ వైరస్లు మనిషి శరీరానికి చేరుతాయి. అనేక జంతువుల మాంసం చైనా సముద్రపు మార్కెట్లో కనిపిస్తుంది. అందువల్ల, కొత్త వైరస్లు అక్కడి నుండి వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. వైరస్ అంటు ద్వారా విస్తరించడంతో అవి ప్రపంచమంతటా వ్యాపించాయి. ముఖ్యంగా చైనాలో మాంసం విక్రయించే మార్కెట్లు ఇలాంటి వైరస్ లకు పుట్టినిల్లుగా మారాయి.

ఏవియన్ ఫ్లూ
AVIAN ఫ్లూ లేదా బర్డ్ ఫ్లూ అనేది వైరల్ ఇన్ఫెక్షన్, ఇది పక్షుల నుండి పక్షులకు వ్యాపిస్తుంది. కోళ్లు లేదా ఇతర పక్షులకు చాలా దగ్గరగా ఉండటం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ముఖ్యంగా వివిధ జాతుల కోళ్లతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్న మనుషుల్లో ఇది వ్యాపిస్తుంది. ఈ వైరస్ నోరు, కళ్ళు మరియు ముక్కు ద్వారా వ్యాపిస్తుంది. ఈ అంటువ్యాధి అనేక రూపాలు చాలాకాలంగా ప్రపంచానికి బహిర్గతమయ్యాయి, అయితే ప్రబలంగా ఉన్న H5N1 1996 లో చైనాలో మొదట కనిపించింది. ఇది అధిక వ్యాధికారక వైరస్ గా పరిగణిస్తారు. 2000 సంవత్సరం తరువాత, అనేక ప్రదేశాలలో ఏవియన్ ఫ్లూ వ్యాప్తి H5N1 కు చాలా పోలి ఉంటుంది. చైనా అంటువ్యాధులను వ్యాపింపజేస్తోందని యుఎస్ నుండి ఆరోపణలు రావడానికి ఇది కారణం కావచ్చు.

స్వైన్ ఫ్లూ
స్వైన్ ఫ్లూ అనేది ఒక అంటు వ్యాధి, దీనిని విస్మరిస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. గత సంవత్సరం దీనికి సంబంధించిన అనేక కేసులు దేశవ్యాప్తంగా వచ్చాయి. స్వైన్ ఫ్లూకి చికిత్స చేయకపోతే, అది కూడా ప్రాణాంతకమవుతుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల రోగులకు ఇది చాలా ప్రమాదకరం. చిన్నపిల్లలు, వృద్ధులు దానిలో చిక్కుకునే అవకాశం ఎక్కువగా ఉంది. తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారితో పాటు, అనారోగ్యంతో ఉన్నవారు కూడా ఈ వ్యాధికి బలైపోతారు. కానీ స్వైన్ ఫ్లూ చైనా ద్వారానే వ్యాపించింది అనేదానిపై అమెరికా వాదనలు సరిగా లేవు. సరిగ్గా చూస్తే, గత ఇరవై ఏళ్లలో ఈ వ్యాధి చాలా దేశాలలో వినాశనం సృష్టించింది. 2007 సంవత్సరంలో, అంటువ్యాధి ఫిలిప్పీన్స్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది.కరోనా వైరస్
కరోనా వైరస్ ఈ శతాబ్దంలో అత్యంత ప్రమాదకరమైన అంటు వ్యాధిగా పరిగణిస్తున్నారు. ఈ మహమ్మారిలో మరణాల రేటు SARS మరియు స్వైన్ ఫ్లూ కంటే చాలా తక్కువగా ఉన్నప్పటికీ, ఇది వేగంగా వ్యాపించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అనేక శతాబ్దాలలో ఒక అంటువ్యాధి ప్రపంచం మొత్తాన్ని ఆపివేసింది ఇదే మొదటిసారి కావచ్చు. కరోనా వైరస్ లేద కోవిడ్ -19 కు సంబంధించి దాదాపు అన్ని పాశ్చాత్య దేశాలు చైనా వైపే వేలెత్తి చూపుతున్నాయి. అయితే, వుహాన్ ల్యాబ్ లో కరోనా వైరస్ పుట్టింది అనే సిద్ధాంతానికి అంత బలం లేదని అటు శాస్త్రవేత్తలు అంటున్నారు. కరోనా వైరస్ మరియు వుహాన్ మాంసం మార్కెట్ ద్వారా కాకుండా, ల్యాబ్ లో తయారైంది అనే విషయంలో చాలా ప్రశ్నలు తలెత్తాయి. అంటువ్యాధి గురించి చైనా సమాచారం దాచిపెట్టిందని, ఇతర దేశాలలో కూడా సంక్రమణను తీవ్రంగా వ్యాపిస్తుందనే విషయం ముందుగా చెప్పలేదని ఆరోపణలు వస్తున్నాయి.

చైనా మాంసం మార్కెట్ కారణంగా కొత్త వ్యాధుల వ్యాప్తి...
చైనా నుండి కొత్త వ్యాధులు వ్యాప్తి చెందడానికి ఒక కారణంగా చెబుతున్నారు. చైనా నగరాల్లో పండ్లు, కూరగాయల నుండి మాంసం వరకు మార్కెట్లో లభిస్తాయి. ముఖ్యంగా చైనా మాంసం మార్కెట్లు కొత్త వ్యాధుల మూలంగా మారుతున్నాయి. చైనాలో అనేక రకాల జంతు మాంసం ఈ మార్కెట్లో కనిపిస్తాయి. చైనా ప్రజలు అనేక సముద్ర జీవుల మాంసంతో పాటు పాము కప్పలు, కీటకాలు వరకూ అన్నీ తింటారు. ఇవన్నీ చైనా నగరాల్లోని మాంసం మార్కెట్లో బహిరంగంగా కనిపిస్తాయి. చైనా నగరాల అధిక జనసాంద్రత, అక్కడి మాంసం మార్కెట్ కారణంగా, అక్కడ నుండి కొత్త వ్యాధులు వెలువడుతున్నాయి.
Published by: Krishna Adithya
First published: May 15, 2020, 8:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading