కరోనాపై ఏపీ ప్రభుత్వం తప్పుడు లెక్కలు.. ఇదిగో సాక్ష్యం: చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో ఏపీలో 10,167 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

news18-telugu
Updated: July 30, 2020, 11:02 PM IST
కరోనాపై ఏపీ ప్రభుత్వం తప్పుడు లెక్కలు.. ఇదిగో సాక్ష్యం: చంద్రబాబు..
చంద్రబాబు
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరీక్షలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఫేక్ నంబర్స్‌తో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు చంద్రబాబునాయుడు ఓ ట్వీట్ చేశారు. అందులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కరోనా శాంపిల్స్ టెస్టుల జాబితాను పోస్ట్ చేశారు. పది లక్షల మందికి రోజుకు సగటున కనీసం 140 కరోనా టెస్టులు కూడా చేయడం లేదని అన్నారు. ఏయే రాష్ట్రాల్లో 140 (రోజుకు పది లక్షల మందికి సగటున), అంతకంటే ఎక్కువ కరోనా టెస్టులు చేస్తున్నారో కేంద్రం ప్రకటించిన జాబితాను చంద్రబాబు పోస్ట్ చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్ పేరు లేదు. ‘కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఎందుకు స్థానం దక్కించుకోలేకపోయింది. ఎందుకు ప్రజలను తప్పుడులెక్కలతో మోసం చేస్తున్నారు.’ అని ట్వీట్ లో ప్రశ్నించారు.



ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో ఏపీలో 10,167 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,30,557కి పెరిగింది. అలాగే, గత 24 గంటల్లో ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 68గా ఉంది. దీంతో కలిపి మొత్తం ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 1281కి పెరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో 9, గుంటూరు జిల్లాలో 9, అనంతపురంలో 8, కర్నూలు 8, విశాఖపట్నంలో 8, చిత్తూరులో 6, కడపలో 6, ప్రకాశం 4, విజయనగరంలో 4, కృష్ణాలో ముగ్గురు, నెల్లూరులో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు కరోనాతో మరణించారు.

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 70,068 కరోనా టెస్టులు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 18,90,077 కరోనా శాంపిల్స్ టెస్ట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 69,252 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 60,024 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వకు 1281 మంది కరోనాతో కన్నుమూశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 30, 2020, 11:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading