లాక్‌డౌన్ ఎత్తివేస్తే అంతే సంగతులు ...ప్రపంచ దేశాలకు WHO హెచ్చరిక...

లాక్ డౌన్ ఆంక్షలు సడలిస్తే కరోనా మరింత వేగంగా ప్రబలే అవకాశం ఉందని జెనీవాలో వర్చువల్ సమావేశంలో డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఫబ్రేయేసస్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: May 7, 2020, 12:38 PM IST
లాక్‌డౌన్ ఎత్తివేస్తే అంతే సంగతులు ...ప్రపంచ దేశాలకు WHO హెచ్చరిక...
ప్రతకాత్మకచిత్రం
  • Share this:
కరోనా వైరస్ ప్రబలకుండా ఉండాలంటే...లాక్ డౌన్ కొనసాగిల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే పలు దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలు పతనం అవుతున్నాయని లాక్ డౌన్ లను ఎత్తి వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఆంక్షలు సడలిస్తే కరోనా మరింత వేగంగా ప్రబలే అవకాశం ఉందని జెనీవాలో వర్చువల్ సమావేశంలో డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఫబ్రేయేసస్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తిని టెక్నాలజీ ఉపయోగించి ట్రాకింగ్, నిర్బంధ నిబంధనలను ఏర్పాటు చేసుకోవాలని టెడ్రోస్ సూచించారు. లాక్ డౌన్ ను దశలవారీగా సడలింపులు ఇవ్వాలని, లేకపోతే కరోనా వైరస్ తిరిగి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని టెడ్రోస్ హెచ్చరించారు. ఇదిలా ఉంటే కరోనా ప్రభావం అధికంగా ఉన్న దేశాలు జర్మనీ, స్పెయిన్, ఇటలీ ఇప్పటికే లాక్ డౌన్ ను సడలించడం ప్రారంభించాయి. అటు అమెరికా సైతం లాక్ డౌన్ ఎత్తివేసేందుకు ప్రాముఖ్యతను ఇస్తోంది. మే 6వతేదీ నాటికి కరోనా రోగుల సంఖ్య 37.8 లక్షలకు పెరిగింది. కరోనా వల్ల 2.61 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
First published: May 7, 2020, 12:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading