ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ (Omicron) కేసులు కలకలం రేపుతున్నాయి. నెమ్మదిగా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. దీంతో ఆయా దేశాల ప్రభుత్వాలు ఆంక్షలు పెంచుతున్నాయి. అమెరికాలో ఒమిక్రాన్కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సిన్లపై డబ్ల్యూహెచ్ఓ (WHO) ఆగ్నే యాసియా రీజినల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్లు వైరస్ సోకే అవకాశాలను తగ్గిస్తాయే తప్ప పూర్తిగా అడ్డుకుంటాయని అనుకోవద్దని అన్నారు. ప్రస్తుతం అందరికీ వ్యాక్సిన్ (Vaccines)లు అందించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని సూచించారు. అవసరం అయితే బూస్టర్ డోస్ అందించాలని అన్నారు. సౌతాఫ్రికా (South Africa) నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తున్నది. భారత్ లోనూ దీని వ్యాప్తి క్రమంగా పెరుగుతున్నది. సెకండ్ వేవ్ లో లక్షల మందిని బలితీసుకున్న డెల్టా వైరస్ కంటే ఒమిక్రాన్ ఐదు రెట్లు ప్రమాదకారి అని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించిన నేపథ్యంలో ఆందోళనలు పెరిగాయి.
Rajnath Singh: మత ప్రాతిపదికన దేశ విభజన "చారిత్రక తప్పిదం": రాజ్‌నాథ్ సింగ్
భారత్ లో ఒమిక్రాన్ కేసులు ఆదివారం నాటికి 37కు పెరిగాయి. కొత్తగా ఏపీలో, చండీగఢ్, నాగపూర్ లో కేసులు వచ్చాయి. ఒమిక్రాన్ ఇలానే వ్యాప్తి చెందుతూ జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి నాటికి పీక్ దశకు చేరుతుందని, తద్వారా ఇండియాలో కరోనా మూడో వేవ్ తలెత్తినట్లవుతుందని, రోజుకు కనీసం 1లక్ష నుంచి 1.5లక్షల కొత్త కేసులు వస్తాయని కొందరు నిపుణులు హెచ్చరించారు.
Rahul Gandhi: నేను హిందువుని, హిందువాదిని కాదు: జైపూర్ ర్యాలీలో రాహుల్ గాంధీ
దేశంలో పెరుగుతున్న కేసులు..
మన దేశంలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే నాలుగు కేసులు వచ్చాయి. ఏపీ, చండీగఢ్, కర్నాటక (Karnataka), మహారాష్ట్రలో ఒక్కో కేసులు వెలుగుచూసింది. ఆంధ్రప్రదేశ్‌లో తొలి కేసు నమోదవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.
Free Online Course: జాబ్ ట్రయల్ చేస్తున్నారా..? ఈ ఫ్రీ ఆన్లైన్ కోర్సులు ట్రై చేయండి!
ఐర్లాండ్ నుంచి ముంబై మీదుగా వైజాగ్‌కు వచ్చిన ఓ 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ వేరియెంట్ నిర్ధారణ అయింది. నవంబరు 27న కరోనా పాజిటివ్ రావడంతో జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. రిపోర్టులో పాజిటివ్ వచ్చింది. అతడిని డిసెంబరు 11న మరోసారి టెస్ట్ చేయగా కోవిడ్ నెగెటివ్ వచ్చింది. మనదేశంలో ఇప్పటి వరకు 36 కేసులు వచ్చాయి. కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, ఏపీ, చండీగఢ్‌లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికం మహరాష్ట్రలోనే ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid -19 pandemic, Covid vaccine, Omicron, Omicron corona variant