news18-telugu
Updated: July 4, 2020, 11:52 PM IST
ప్రతీకాత్మక చిత్రం (File)
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం భారీ మొత్తంలో కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. అమెరికా, బ్రెజిల్, రష్యా, ఇండియా, యూకే, స్పెయిన్, పెరూలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఐతే పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ.. ఆ వ్యాధి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. మరికొందరు మాత్రం కరోనా బారినపడి మృత్యువాత పడుతున్నారు. మధుమేహం, ఆస్తమా, గుండె, మూత్రపిండాల సమస్యతో పాటు ఇతర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారిలోనే కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తల్లో చూస్తున్నాం. ఐతే కరోనా మరణాలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక విషయాన్ని వెల్లడించింది.
కరోనా బారినపడి మృతి చెందిన వారిలో ఎక్కువ మంది పొగతాగే వారే ఉన్నారని WHO తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కేసులు, మరణాలను పరశీలిస్తే ఈ విషయం తెలుస్తుందని వెల్లడించింది. పొగతాగేవారిలోనే ఎక్కువ మంది కరోనా బారినపడుతున్నారని... వారిలోనే ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తగా ఇప్పటివరకూ 1.9 కోట్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 60,88,309 మంది కోలుకున్నారు. కరోనా బారినపడిన వారిలో 5,21,163 మంది మరణించారు.
కాగా, భారత్లో గడిచిన 24 గంటల్లో 19,148 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో 434 మంది మరణించారు. మనదేశంలో ఇప్పటి వరకు 604,641 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 359,860 మంది కోలుకోగా.. 17,834 మంది మరణించారు. ప్రస్తుతం భారత్లో 17,834 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
Published by:
Shiva Kumar Addula
First published:
July 4, 2020, 11:46 PM IST