WHO OMICRON IS DANGEROUS THAN DELATA VARIANT AND IT OMICRON IS LETHAL EVK
WHO: ఒమిక్రాన్ ప్రాణాంతకం కాదు అనేది అవాస్తవం.. జాగ్రత్త తప్పని సరి: డబ్ల్యూహెచ్ఓ
ప్రతీకాత్మక చిత్రం
World Health Organization | ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉన్నా ప్రాణాంతకం కాదని ఇప్పటి వరుకు పలువురు వైద్యులు, నిపుణులు చెబుతున్నారు. దీనిపై డబ్ల్యూహ్చ్ఓ స్పందించింది. ఒమిక్రాన్న తీవ్రతను తక్కువగ ఉందని చెప్పడం అర్థం లేదని స్పష్టం డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధానమ్ అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు (Corona Cases) వేగంగా మళ్లీ పెరగుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అయితే కరోనా కొత్త వేవ్ దెబ్బకు ఇబ్బంది పడుతోంది. దేశంలోనూ మళ్లీ కరోనా కేసుల సంఖ్య లక్షకుపైగా వచ్చాయి. దీంతో మూడో వేవ్ (Third Wave) ప్రారంభం అయ్యిందని అందరూ భావిస్తున్నారు. అయితే ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉన్నా ప్రాణాంతకం కాదని ఇప్పటి వరుకు పలువురు వైద్యులు, నిపుణులు చెబుతున్నారు. దీనిపై డబ్ల్యూహ్చ్ఓ (WHO) స్పందించింది. ఒమిక్రాన్న తీవ్రతను తక్కువగ ఉందని చెప్పడం అర్థం లేదని స్పష్టం డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధానమ్ అన్నారు. ఒమిక్రాన్ ప్రాణాంతక వేరియంట్ అని పేర్కొంది. ప్రస్తుతం ఒమిక్రాన్ బాధితులు ఆస్పత్రుల్లో చేరుతున్నారని.. ఆయా దేశాలు అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
టీకాలు వేగంగా ఇవ్వాలి..
డెల్టాపోలిస్తే తీవ్రత తక్కువ ఉన్నంత మాత్రానా ప్రాణాంతక వేరియంట్ కాదని చెప్పడం సరికాదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధానమ్ అన్నారు. టీకాల అసమాతన కారణంగానే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు పారదర్శంగా వ్యవహరించి మహమ్మారి అంతానికి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని దేశాలు టీకాలను వేగవంతం చేయాలని ఆయన సూచించారు.
దేశంలో కొన్ని వారాలుగా కరోనా (Corona) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా డెల్టా వేరియంట్ కంటేఒమిక్రాన్ (Omicron) వేగంగా విస్తరిస్తున్నట్టు వైద్య నిపుణులు గుర్తిస్తున్నారు. దేశంలో రోజుజువారీ కేసులు లక్ష దాటాయి. గడిచిన 24 గంటల్లో 1,17,100 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గురువారం దేశవ్యాప్తంగా 30,836 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న 302 మరణాలు నమోదయ్యాయి.
ఒక్కరోజులోనే ఏకంగా లక్షకు పైగా కేసులు రావడంతో ప్రజల్లో మళ్లీ ఆందోళన నెలకొంది. కొత్త కేసులు ఏకంగా 216 రోజుల గరిష్టానికి చేరుకున్నాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,52,26,386కి చేరింది. భారత్లో ఇప్పటి వరకు 3,43,71,845 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 4,83,178 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో 3,71,363 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
ఒమిక్రాన్ సోకిన వారిలో ఎక్కువగా గుర్తించిన లక్షణాలు
- ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి నిర్దిష్ట లక్షణాలంటూ ప్రత్యేకంగా లేవు.
- డెల్టా వలె, ఓమిక్రాన్ సోకిన వారిలో కొందరిలో లక్షణాలు బయటపడడం లేదు.
- వేరియంట్ సోకినవారికి కండరాల నొప్పితో పాటు 1-2 రోజులు అలసిపోయినట్లు అనిపిస్తుంది.
- గొంతు నొప్పి, తలనొప్పి మరియు ఛాతీ నొప్పి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.
- ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి తలనొప్పి, శరీరంలో నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
- వ్యాక్సిన్ తీసుకోని వారు ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడుతున్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.