WHO | ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఏ దేశం ఎంత నిధులిస్తుంది?

ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఓ కలకలం మొదలైంది.

news18-telugu
Updated: April 15, 2020, 6:51 PM IST
WHO | ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఏ దేశం ఎంత నిధులిస్తుంది?
ప్రపంచ ఆరోగ్య సంస్థ
  • Share this:
ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఓ కలకలం మొదలైంది. అయితే, అసలు ఈ WHOకు నిధులు ఎలా వస్తాయి? ఏయే దేశాలు ఎంత మొత్తంలో నిధులు అందిస్తాయి? దానికి నిబంధనలు ఉంటాయా? లేకపోతే వాలంటరీగా ఇస్తారా? అనేది తెలుసుకుందాం. WHO సభ్య దేశాల (ప్రస్తుతం 194) నుంచి నిధులు తీసుకుంటుంది. అలాగే, వివిధ సంస్థల నుంచి కూడా నిధులు పొందుతుంది. WHO వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం ఆ సంస్థకు అమెరికా నుంచి అత్యధికంగా నిధులు అందుతాయి. అమెరికా 6.2 బిలియన్ డాలర్ల సాయాన్ని అందిస్తుంది. అంటే WHOకు అందే నిధుల్లో 14.67 శాతం అమెరికానే ఇస్తుందన్నమాట. అమెరికా తర్వాత బిల్, మిలిందా గేట్స్ ఫౌండేషన్ నుంచి అత్యధిక సాయం (9.76శాతం) అందుతుంది. ఆ తర్వాత జెనీవాకు చెందిన ప్రభుత్వ - ప్రైవేట్ పార్టనర్‌షిప్ సంస్థ GAVI Alliance (8.39 శాతం) నిధులు అందుతాయి. ఈ సంస్థకు బిల్, మిలిందా గేట్స్ ఫౌండేషన్ కూడా నిధులు అందిస్తుంది.

ఆ తర్వాత యూకే (7.70 శాతం), జర్మనీ (5.68 శాతం) మాత్రమే 5 శాతం కంటే ఎక్కువగా నిధులు అందిస్తాయి. ఐక్యరాజ్యసమితిలోని (UNOCHA) మాత్రం 5 శాతం నిధులు ఇస్తుంది. వరల్డ్ బ్యాంక్ (3.42 శాతం), రోటరీ ఇంటర్నేషనల్ (3.3 శాతం), యూరోపియన్ కమిషన్ (3.3 శాతం), జపాన్ (2.7 శాతం) నిధులు అందజేస్తాయి.

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చర్చనీయాంశంగా మారిన చైనా ఎంత ఇస్తుందో తెలుసా. కేవలం 0.21 శాతం. మొత్తం WHOకు అందే నిధుల్లో చైనా నుంచి 0.21 శాతం నిధులు అందుతాయి. చైనాతో పోలిస్తే భారత్ రెండింతల నిధులను WHOకు అందిస్తుంది. WHOకు అందే నిధుల్లో భారతదేశం వాటా 0.48 శాతం. ఫ్రాన్స్ (0.5 శాతం) ఇస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, చివరకు పాకిస్తాన్ కూడా ప్రతి ఏటా (0.36 శాతం) నిధులను WHOకు అందిస్తుంది. అది చైనా ఇస్తున్నదాని కంటే కూడా ఎక్కువే.

WHO నాలుగు విధాలుగా నిధులు సేకరిస్తుంది. 1. వాలంటరీగా నిధులు సేకరణ, 2. ఒక ప్రత్యేకమైన అంశం కోసం నిధుల సమీకరణ (ఉదా. కరోనా వైరస్‌కు మందు కనుక్కోవడం), 3. WHO‌లో మెంబర్‌షిప్ ఫీజు. ఒక్కో దేశం ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కో విధమైన మెంబర్‌షిప్ ఫీజ్ ఉంటుంది. 4. మహమ్మారుల నివారణ చర్యల ఫండ్.
Published by: Ashok Kumar Bonepalli
First published: April 15, 2020, 6:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading