Rodrigo warning: వ్యాక్సిన్ వేసుకోకపోతే భారత్ కు పొండి..? రోడ్రిగో వివాదాస్పద వ్యాఖ్యలు

టీకా వేసుకోనండి భారత్ కు పొండి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి వివాదాస్పద వ్యాఖ్యలు

ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.. వ్యాక్సిన్ వేయించుకోండి లేదా భారత్ కు పొండి అని అక్కడి ప్రజలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు..

  • Share this:
    ప్రపంచంలో వివాదాస్పద అధ్యక్షుల్లో రోడ్రిగో ఒకరు.. నిత్యం తన వ్యాఖ్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే కాదు.. వివాదాలకు తెర తీస్తూ ఉంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే మరోసారి దేశ ప్రజలను భయపెట్టే ఉద్దేశంతో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఊహించని స్థాయిలో కరోనా కేసులు ఆ దేశంలో ప్రస్తుతం విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా మరణాలు రేటు ఘోరంగా పెరగడం తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలను హెచ్చరించాలి అనున్నారు రోడ్రిగో.. కరోనా వ్యాక్సిన్‌ తీసుకోని వారిని జైలులో పెడతామని వార్నింగ్‌ ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటారా? లేక జైలుకు వెళ్తారా? అని బెదిరించారు. అక్కడితోనే అతడి వ్యాఖ్యలు ఆగలేదు.. వ్యాక్సిన్ తీసుకోవడం ఇష్టం లేదనుకునే వాళ్లు.. భారత్ కు పొండి లేదా అమెరికాకు వెళ్లండి అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే నెటిజన్లు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు..

    ప్రస్తుతం ఫిలిప్పీన్స్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ విలయ తాండవం చేస్తోంది. ప్రపంచంలోనే కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరంగా విస్తరిస్తున్న దేశాల్లో ఫిలిప్పీన్స్ ఒకటి. దేశంలో ఇప్పటివర​కు 13 లక్షల పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 23 వేల మందికి పైగా మరణించారు. దీంతో దేశ అధ్యక్షడు కరోనా కట్టడి చర్యలపై ఫోకస్ చేస్తున్నారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా రోజు రోజుకూ కేసులు పెరుగుతున్నాయి.. కరోనా మాత్రం కట్టడి కావడం లేదు. దీంతో తీవ్ర అవేశానికి లోనైన ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు.

    సెకెండ్ వేవ్ రూపంలో కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తుంటే.. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ కు కొంతమంది విముఖత చూపిస్తున్నారు. దాంతో టీకా వేసుకోవడానికి నిరాకరించిన ప్రజలపై రోడ్రిగో డ్యూటెర్టే విరుచుకుపడ్డారు. టీకా వద్దంటే ఖబర్దార్‌.. జైలులో ఊచలు లెక్కించాల్సిందే అని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఎవరైనా టీకా తీసుకోవడం ఇష్టలేకపోతే మనం దేశం వదిలి భారత్ పొండి అంటూ హెచ్చరించారు. లేదా అమెరికా వెళ్లాలి అనుకుంటే అక్కడికైనా పొండి అంటూ సీరియస్ అయ్యారు.

    అప్పటికే  నోరు జారిన అధ్యక్షుడు తరువాత తన మాటలను సవరించుకోవాలి అనుకున్నారు. దేశంలో కరోనా సంక్షోభం ఉండడంతోనే తాను ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది అన్నారు. తనను తప్పుగా భావించవద్దని రోడ్రిగో డ్యూటెర్టే వివరణ ఇచ్చుకున్నారు. జూన్ 20 నాటికి, ఫిలిప్పీన్స్ అధికారులు 2.1 మిలియన్ల మందికి పూర్తిగా టీకాలు వేశారని దేశ అధ్యక్షుడు గుర్తు చేస్తున్నారు..
    Published by:Nagesh Paina
    First published: