భారత్‌లో కరోనా కట్టడి చర్యలు భేష్.. ప్రధాని మోదీపై WHO ప్రశంసలు

మనదేశంలో గడిచిన 24 గంటల్లో 47905 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 52718 మంది కోలుకోగా.. 550 మంది మరణించారు.

news18-telugu
Updated: November 12, 2020, 12:52 PM IST
భారత్‌లో కరోనా కట్టడి చర్యలు భేష్.. ప్రధాని మోదీపై WHO ప్రశంసలు
WHO డీజీతో ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో)
  • Share this:
భారత్‌లో కరోనా కట్టడికి మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రశంసించారు. ముఖ్యంగా కరోనా వాక్సిన్ 'కోవాగ్జిన్' అభివృద్ధిలో భారత ప్రభుత్వం చిత్తశుద్ధిని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గ్యాబ్రియెసస్ కొనియాడారు. కరోనా కట్టడికి బాగా పోరాడుతున్నారని ధన్యవాదాలు తెలిపారు. కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ తయారిలో భారత్‌కు పూర్తి సహకారం ఉంటుందని వెల్లడించారు WHO డీజీ.

భారత ప్రధాని నరేంద్ర మోదీ, డబ్ల్యూహెచ్‌వో డీజీ గ్యాబ్రియేసస్‌ కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు, సంప్రదాయ ఔషధాల గురించి బుధవారం ఫోన్‌లో సంభాషించారు. ప్రపంచానికి సంప్రదాయ ఔషదాల అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. వీటిపై మరింత పరిజ్ఞానం, పరిశోధనలు అవసరమని అందుకోసం పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని ఇరువురు నిర్ణయించారు.

ీ్ే

ఇక కరోనాను ఎదర్కొనడంలో యావత్ ప్రపంచం మొత్తాన్ని ఒక్కటి చేసేందుకు WHO చేపట్టిన చర్యలను ప్రధాని మోదీ ప్రశంసించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆరోగ్య ప్రమాణాల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారం ముఖ్యమైనది పేర్కొన్నారు. ప్రస్తుత వైద్య విధానంలో సంప్రదాయ ఔషదాలను వినియోగించాల్సిన అవసరం ఉందని.. దానికి సంబంధించి శాస్త్రవేత్తల నుంచి అనుమతి లభించగానే మరో అడుగు ముందకు పడుతుందని మోదీ తెలిపారు. దేశంలో నవంబర్‌ 13న ఆయుర్వేద దినోత్సావాన్ని నిర్వహిస్తున్నామని.. ఈ సందర్భంగా ‘కరోనాకు ఆయుర్వేదం’ అనే అంశాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నట్లు వెల్లడించారు ప్రధాని మోదీ.

కాగా, మనదేశంలో గడిచిన 24 గంటల్లో 47905 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 52718 మంది కోలుకోగా.. 550 మంది మరణించారు. తాజా లెక్కలతో భారత్‌లో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86,83,916కి చేరింది. ఇప్పటి వరకు 80,66,501 మంది కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 1,28,121కి చేరింది. ప్రస్తుతం మన దేశంలో 4,89,294 యాక్టివ్ కేసులున్నాయి. ఇక టెస్ట్‌ల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 11,93,358 మందికి కరోనా పరీక్షలు చేశారు. దాంతో మొత్తం టెస్ట్‌ల సంఖ్య 12 కోట్ల 19 లక్షల 62,509కి చేరింది.
Published by: Shiva Kumar Addula
First published: November 12, 2020, 12:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading