#WhereisKCR | కేసీఆర్ ఎక్కడ?.. సీఎంను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

#WhereisKCR అనే హ్యాష్ టాగ్ ప్రస్తుతం ట్విటర్‌లో ట్రెండింగ్ అవుతోంది.

news18-telugu
Updated: July 5, 2020, 4:29 PM IST
#WhereisKCR | కేసీఆర్ ఎక్కడ?.. సీఎంను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..
తెలంగాణ సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
#WhereisKCR అనే హ్యాష్ టాగ్ ప్రస్తుతం ట్విటర్‌లో ట్రెండింగ్ అవుతోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. గత రెండు రోజు రోజుల్లోనే తెలంగాణలో 3700కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈనెల 4వ తేదీన 1,850, ఈనెల 3వ తేదీన 1,892 కరోనా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో కూడా భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రాజధానిలో లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం నేపథ్యంలో కొందరు గ్రామాలకు వెళ్లిపోతున్నట్టుగా జాతీయరహదారులు, టోల్ గేట్ల వద్ద రద్దీని చూస్తే తెలుస్తుంది. కరోనా సంక్షోభంలో ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన కేసీఆర్ ప్రజలకు కనిపించకపోవడాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు తప్పుపడుతున్నారు. దీంతోపాటు సీఎం కేసీఆర్ నివాసం ప్రగతిభవన్ వరకు కరోనా వచ్చేసింది. 20 మంది సిబ్బందికి కరోనా సోకింది. అందులో భద్రతా సిబ్బంది ఉన్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లిపోయారంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.







మరికొందరు కేసీఆర్ పాత వీడియోలను పెట్టి ట్రోల్ చేసున్నారు.



తెలంగాణలో ఇప్పటి వరకు 110545 కరోనా టెస్టులు నిర్వహించారు. వారిలో 83,656 మందికి కరోనా నెగిటివ్ వచ్చింది. 22,312 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం 10,487 కోవిడ్ 19 పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. 11,537 మంది డిశ్చార్జ్ అయ్యారు. 288 మంది ప్రాణాలు కోల్పోయారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 5, 2020, 4:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading