Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ తయారీ.. అసలేం జరుగుతోందంటే..

Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ తయారీ.. అసలేం జరుగుతోందంటే..

ప్రతీకాత్మక చిత్రం

Corona Vaccine: ప్రపంచాన్ని వణిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు పది లక్షల మందిని పొట్టనబెట్టుకున్న కరోనాను తరమికొట్టేందుకు వీలైనంత త్వరగా వ్యాక్సిన్ ను ఆవిష్కరించేందుకు ప్రపంచ దేశాలు పోటీపడుతున్నాయి.

  • Share this:
ప్రపంచాన్ని వణిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఔషధ కంపెనీలకు వ్యాక్సిన్ విషయంలో ఆయా దేశాలు ప్రోత్సాహకాలు సైతం అందిస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారు పది లక్షల మందిని పొట్టనబెట్టుకున్న కరోనాను తరమికొట్టేందుకు వీలైనంత త్వరగా వ్యాక్సిన్ ను ఆవిష్కరించేందుకు ప్రపంచ దేశాలు పోటీపడుతున్నాయి.

ఏయే దేశాలు ముందున్నాయి?

బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనెకా సంస్థ వాక్యిన్ కోసం ప్రయోగాలు చేస్తుంది. జర్మన్ సంస్థ బయోఎన్‌ టెక్ ఎస్ఈ తో కలిసి అమెరికాకు చెందిన ఫైజర్, మరో అమెరికన్ కంపెనీ మొడెర్నా, జాన్సన్ & జాన్సన్ సంస్థలు వ్యాక్సిన్ ప్రయోగాల్లో ముందు వరుసలో ఉన్నాయి. ఈ కంపెనీలు రాబోయే రెండు నెలల్లో పెద్ద ఎత్తున ట్రయల్స్ నిర్వహించే అవకాశం ఉంది.

ట్రయల్స్‌లో ఏం తెలిసింది?

వివిధ కంపెనీలు వాలంటీర్లకు టీకాలు ఇస్తున్నాయి. వీటిని పొందిన వారిలో COVID-19ను అడ్డుకునే యాంటీబాడీలు ఎంత మేరకు అభివృద్ధి చెందాయో తెలుసుకుంటున్నారు. తొలి దశ ప్రయోగాల్లో వాలంటీర్ల శరీరంలో చోటుచేసుకున్న మార్పులను ఎప్పటికప్పుడు నమోదు చేసి విశ్లేషిస్తున్నారు. ఆరోగ్యకరమైన వాలంటీర్లలో కొంతమందికి తమ టీకాలను ప్లేసిబో అనే సాధారణ సెలైన్ ద్రావణంతో కలిపి ఇస్తున్నారు. మరికొంతమందికి అసలైన వ్యాక్సిన్ డోస్ ఇస్తున్నారు. ట్రయల్ పాల్గొనేవారికి ఎవరెవరికి టీకా, ప్లేసిబో ఇచ్చారో తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్రయల్స్ పూర్తయిన తరువాత డేటాను విశ్లేషిస్తున్నారు.

వ్యాక్సిన్ పనితీరు ఎలా తెలుస్తుంది?

వ్యాక్సిన్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంతో తెలుసుకోవడానికి అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్, ప్రపంచ ఆరోగ్య సంస్థలు కొన్ని ప్రమాణాలను(స్టాండర్డ్స్‌) నిర్ణయించాయి. వ్యాక్సిన్లు కనీసం 50 శాతం సామర్థ్యాన్ని ప్రదర్శించాలి. ఈ డేటాను స్వతంత్ర ప్యానెల్ లు పర్యవేక్షిస్తాయి. ఈ డేటాను సేఫ్టీ మానిటరింగ్ బోర్డులు ఫలితాలను ఎప్పటికప్పుడూ విశ్లేషిస్తాయి. ప్లాసిబో ఇచ్చిన వాలంటీర్లతో పోలిస్తే వ్యాక్సిన్ ఇచ్చిన వారిలో మంచి ప్రభావం కనిపిస్తే ఆ కంపెనీలు ఎమర్జెన్సీ వినియోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతటితో వ్యాక్సిన్ పై చేసే పరిశోధనలను కంపెనీలు ఆపేయవచ్చు, లేదా కొనసాగించవచ్చు. టీకా సురక్షితం కాదని ప్యానెల్ నిర్ణయిస్తే ట్రయల్ కూడా ఆపేస్తారు.


వ్యాక్సిన్ సురక్షితమేనా?


కంపెనీలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లను పూర్తిస్థాయిలో పరీక్షించాకే వాడకానికి అనుమతిస్తామని ఆయా దేశాలు ప్రకటించాయి. వ్యాక్సిన్ సురక్షితంగా, సమర్థవంతంగా ఉంటేనే దాన్ని ఆమోదిస్తామని యు.ఎస్. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తేల్చి చెప్పింది. యు.ఎస్ వ్యాక్సిన్ల కోసం ఈ సంస్థ కఠినమైన మార్గదర్శకాలను వెల్లడించింది. వాలంటీర్లు తుది టీకా స్వీకరించిన తర్వాత కనీసం రెండు నెలల పాటు వారి ఆరోగ్య పరిస్థితులను విశ్లేషించి, సైడ్ ఎఫెక్ట్స్‌ లేవని నిర్ధారించాలని FDA తెలిపింది. ట్రయల్స్ లో పాల్గొనేవారిలో కనీసం సగం మంది నుంచి సేకరించిన డేటాను ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్‌(EUA) పరిశీలిస్తుంది. బ్రిటన్ కు చెందిన UK మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ వ్యాక్సిన్ పనితీరును సమీక్షిస్తుంది. ఈయూ కోసం యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ టీకా పనితీరును సమీక్షిస్తుంది.

డేటాను ఎవరు సమీక్షిస్తారు?

ట్రయల్స్ తరువాత EUA లేదా అధికారిక అనుమతి కోసం కంపెనీలు దరఖాస్తు చేసుకుంటాయి. వారు ఇచ్చే డేటాను రెగ్యులేటర్లుగా ఉండే స్వతంత్ర సంస్థలు సమీక్షిస్తాయి. ఫైజర్, బయోటెక్ కంనెనీ ఈ నెలలోనే టీకా పనితీరు గురించి ప్రకటించనుంది. మొడెర్నా వచ్చే నెలలో, ఆస్ట్రాజెనెకా రాబోయే రెండు నెలల్లో చివరి దశ ట్రయల్స్ కు సంబంధించిన డేటాను సమర్పించనున్నాయి. యూరప్, కెనడా రెగ్యులేటర్లు రోలింగ్ ప్రాతిపదికన డేటాను పరిశీలిస్తున్నాయి. అత్యవసర వాడకం కోసం సమీక్షలను వీలైనంత త్వరగా పూర్తిచేస్తామని అమెరికా, బ్రిటన్ ప్రకటించాయి.

మొట్టమొదటి కరోనావైరస్ టీకా ఏది?

ఎమర్జెన్సీ వినియోగం కింద తమ దేశంలోని కార్మికులకు జూలైలోనే చైనా వ్యాక్సిన్ అందించింది. చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్ (సీఎన్‌బీజీ), కాన్సినో బయోలాజిక్స్, సినోవాక్ సహా కనీసం నాలుగు వ్యాక్సిన్లను ఆ దేశం అభివృద్ధి చేసింది. సినోవాక్, సిఎన్‌బిజి నవంబరులోపు ముందస్తు ట్రయల్ డేటాను సమీకరిస్తాయని అంచనా వేస్తున్నారు. రష్యాకు చెందిన గమలేయ ఇన్స్టిట్యూట్ 40,000 మందిపై చివరి దశ ట్రయల్స్ నిర్వహిస్తోంది. అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ ప్రారంభంలో ఈ ట్రయల్స్ కు సంబంధించిన డేటాను విడుదల చేసే అవకాశం ఉంది. రష్యా ఇప్పటికే ఎంతోమంది సాధారణ ప్రజలకు ఈ వ్యాక్సిన్ ఇచ్చింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రభావం ఉందా?

కోట్లమంది ఆరోగ్యంపై ప్రభావం చూపించే వ్యాక్సిన్లకు అనుమతివ్వాలంటే దాన్ని FDA ఆమోదించాలి. కానీ యు.ఎస్. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్(హెచ్ హెచ్ఎస్) కు FDA సిఫారసులను తోసిపుచ్చే అధికారం ఉంది. వ్యాక్సిన్ వీలైనంత త్వరగా తీసుకురావాలని ప్రయత్నిస్తున్న ట్రంప్, అమెరికాలోని భద్రతా మార్గదర్శకాలపై ఫిర్యాదు చేశాడు. వాటి వల్ల వ్యాక్సిన్ ఆలస్యమవుతుందని ఆయన చెబుతున్నాడు. నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికలకు ముందే వ్యాక్సిన్ విడుదల చేయాలనే లక్ష్యంతో ట్రంప్ పనిచేస్తున్నాడు. కానీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను హెచ్‌హెచ్‌ఎస్ తోసిపుచ్చే అవకాశం ఉంది. వ్యాక్సిన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక అంశంగా ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published: